-నిజాయితీగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీని కోరుతున్నాం
-ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
-బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్
విశాఖ:ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీ సాధారణ ఎన్నికల స్థాయిలో చేస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ఆరోపించారు. వీఆర్ఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఈర్ల శ్రీరామ్ మూర్తి బీజేపీలో చేరారు. అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడారు.
‘‘నిజాయితీగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీని కోరుతున్నాం.శాసన మండల రద్దు చేస్తామని తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ రోజు ఎన్నికలకు ఎలా వెళ్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఒకరోజు కూడా శాసన మండలిలో అడుగుపెట్టలేదు.శాసనమండలిని అగౌరవపరిచిన వ్యక్తి జగన్ ఎలా ఎన్నికలు పెడతారు? సచివాలయం సిబ్బందిని ప్రభుత్వం వారి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. టీచర్లును,ఉద్యోగులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుంది.
టీచర్లను బెదిరిస్తూ ఆంక్షలు పెడుతూ అత్యంత కఠోరంగా వ్యవహరిస్తుంది.ప్రతి గ్రామానికి వచ్చిన సౌకర్యాలు కేంద్ర సహకారంతో వచ్చాయో లేదో చెప్పాలి. కేంద్ర సహకారంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తాం.’’ అని మాధవ్ స్పష్టం చేశారు