– లోకేష్ ర్యాగింగ్ కంటిన్యూస్
– టిడిపి తెచ్చిన కంపెనీలు, సంస్థలు ఇవి, జగన్ ఏమి తెచ్చారో చెప్పగలరా?
– యువగళం పాదయాత్రలో కొనసాగుతున్న లోకేష్ సెల్ఫీ చాలెంజ్
– ప్రఖ్యాత విద్యా సంస్థ కాండోర్ ఇంటర్నేషన్ స్కూల్ ముందు సెల్ఫీ దిగిన లోకేష్
యువగళంలో నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్కొనసాగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవ చేసే విధంగా టిడిపి ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు, తెచ్చిన సంస్థల ముందు సెల్ఫీలు దిగి “మేము తెచ్చినవి ఇవి, నువ్వు ఏమి తెచ్చావు జగన్” అంటూ సెటైరిక్‌గా ప్రశ్నిస్తూ వస్తున్నారు లోకేష్. తిరుపతి నియోజకవర్గంలో మంగళవారం పాదయాత్రగా వెళుతూ ఐతేపల్లి వద్ద కాండోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు నారా లోకేష్ సెల్ఫీ దిగారు.
డైబ్బయి ఏళ్లకి పైగా చరిత్రగలిగిన ప్రఖ్యాత విద్యా సంస్థ కాండోర్ టిడిపి హయాంలోనే ఏర్పాటైంది. ఈ సంస్థకి అప్పట్లో చంద్రబాబు సర్కారు 8 ఎకరాల భూమి కేటాయించింది. ఇప్పటివరకూ టిడిపి కృషితో
వచ్చిన ఉద్యోగ, ఉపాధి కల్పించే కంపెనీలు-సంస్థల ముందు ఫోటోలు దిగి చాలెంజ్‌లు విసిరిన లోకేష్, కాండోర్ ముందు సెల్ఫీ దిగి మేము తెచ్చిన ప్రఖ్యాత విద్యాసంస్థ ఇది అని గర్వంగా ప్రకటించారు.