జగన్ ప్రభుత్వం కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాల్ని డాష్ బోర్డ్ లో ఎందుకు పెట్టలేదు?
– విశాఖ గ్లోబల్ సమ్మిట్.. ముమ్మాటికీ ఫేక్ సమ్మిటే
• గతంలో దావోస్ లో 4కంపెనీలతో ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో తనబినామీల కంపెనీలతో ఉత్తుత్తి ఒప్పందాలకే పరిమితమయ్యాడు
•రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి, ఉద్యోగఉపాధి అవకాశాలు కల్పించడం అంటే .. కోడినుంచి గుడ్డువస్తుంది.. గుడ్డు పిల్లవుతుంది అని కథలు చెప్పినంత తేలికకాదు
– రూ.లక్ష మూలధనంతో ప్రారంభమైన ఇండోసోలార్ సంస్థ, రూ.76వేలకోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందో ముఖ్యమంత్రి, మంత్రి అమర్నాథ్ చెప్పాలి
యువగళం పాదయాత్ర ప్రదేశంలో (పీలేరు) మాజీమంత్రి అమర్నాథ రెడ్డి
“అధికారంలోకి వచ్చాక 4ఏళ్లపాటు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ఇప్పు డు మేల్కొని ఆదరాబాదరాగా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ తో రా ష్ట్రానికి ఒరిగేదేమీలేదు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు దావోస్ వెళ్లడానికి అయిన ఖర్చు రూ.12కోట్ల48లక్షల64వేలు. అంతఖర్చు పెట్టి అక్కడికి వెళ్లి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అరవిందో రియాలిటీ ఇన్ ఫ్రా లిమిటెడ్, గ్రీన్ కో గ్రూప్, సహా, మరోపరిశ్రమతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ నాలుగుకంపెనీల్లో ఒకటి విజయసాయిరెడ్డి వియ్యంకుడిది, మరోటి జగన్ రెడ్డి గతంలో ఎంపీ సీటు ఇచ్చిన వ్యక్తిది. ఇంకోటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడూ అందుబాటులో ఉండే అదానీకి చెందిన సంస్థ. ఇలాంటి పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవ డానికి దావోస్ వరకు వెళ్లాల్సిన పనిలేదు. దానికోసం రూ.12కోట్ల ప్రజలసొమ్ము వృథాచేయ డం మరీదారుణం.
గతంలో దావోస్ వెళ్లి, రాష్ట్రానికి ఎలాంటిపరిశ్రమలు తీసుకురాలేని ము ఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు డబ్బాలు కొట్టుకుంటున్న గ్లోబల్ సమ్మిట్ తో కూడా ఏపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ఎంతప్రతిష్టాత్మకంగా నిర్వహిం చిందో చెప్పడానికి దానిపై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ప్రజల కామెంట్సే నిద ర్శనం. గ్లోబల్ సమ్మిట్ ముగిశాక ఒక మీడియాప్రతినిధి మంత్రి అమర్ నాథ్ ను మొత్తం ఎన్నిపరిశ్రమలు ఒప్పందాలు చేసుకున్నాయి..ఎన్నివేలకోట్లు పెట్టుబడులు రాబోతున్నా యని అడిగితే, “నాకు తెలియదు.. చెక్ చేసుకొని చెబుతాను” అని మంత్రిచెప్పడం విడ్డూరం.
ఈ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో ఎన్ని ప్రముఖ కంపెనీలు (జాతీయ,అంతర్జాతీయస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు) ఉన్నాయో ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖామంత్రి చెప్పాలి. ఇండోసోలార్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థలు రెండూ అనామక కంపెనీలే. రూ.లక్ష మూలధనంతో ప్రారంభమైన ఇండోసోలార్ సంస్థ, జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో రెన్యుబుల్ ఎనర్జీరంగంలో రూ.76వేలకోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పారు. అది ఎలాసాధ్యమవుతుందో ముఖ్యమంత్రి, మంత్రి గుడివాడ అమ ర్నాథ్ చెప్పాలి. ఇండోసోలార్, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థలు రెండూ జగన్మోహన్ రెడ్డి బినా మీలకు చెందినవే.
టీడీపీప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను తప్పుపట్టిన జగన్, ఇప్పుడు అనామక కంపెనీలతో విద్యుత్ ఉత్పత్తిఒప్పందాలు చేసుకోవడం ప్రజల్ని మోసగించడం కాదా?
రాష్ట్రానికి కేవలం 11,448 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అవసరమైనప్పుడు, వైసీపీప్రభు త్వం 2లక్షల మెగావాట్ల రెన్యుబుల్ ఎనర్జీ తయారీకోస ఒప్పందాలు ఎందుకు చేసుకుంది? ఎంత విద్యుత్ ఉత్పత్తిచేస్తారు..దానిలో ఎంత బయటిరాష్ట్రాలకు అమ్ముకుంటారు? సదరు సం స్థలు విద్యుత్ ఉత్పత్తికోసం వాటికి ఎంతభూమిని ప్రభుత్వం కేటాయించబోతోంది? ఎంతమొ త్తంలో ఇతరత్రా రాయితీలు కల్పించబోతోంది? విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి గతప్రభు త్వం విద్యుత్ తయారీసంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దుచేయవద్దని ప్రతిపక్షాలు, కేంద్రప్రభుత్వం మొత్తుకున్నా వినకుండా జగన్ వాటిని రద్దుచేయడానికే సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి ఏకపక్షనిర్ణయంపై, ఆయాసంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో చివ ర కు విధిలేక పాలకులు వెనక్కుతగ్గారు. గతప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను తప్పుపట్టిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఇప్పుడు అనామకకంపెనీలతో విద్యుత్ ఉత్పత్తి ఎలా చేయిస్తుందో, రాష్ట్రఅవసరాలు పోగా మిగులువిద్యుత్ ఉత్పత్తి ఎలా సాధిస్తుందన్నది అంతు చిక్కని ప్రశ్నలు.
జగన్ హయాంలో ఎఫ్ డీఐ ఆకర్షణలో రాష్ట్రం దేశంలోనే అట్టడుగు స్థానానికి చేరింది. నిరుద్యోగశాతంలో ఏపీ ఆఫ్రికాదేశాలతో పోటీపడుతోంది. టీడీపీప్రభుత్వంలో రాష్ట్రంలో నిరుద్యోగశాతం 3.5శాతముంటే, ఇప్పుడు 13.5శాతానికి చేరింది
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే, ఎఫ్ డీఐ (ఫారెన్ డెవలప్ మెంట్ ఇన్వెస్ట్ మెంట్స్) ఆకర్షణలో కూ డా జగన్ సర్కార్ వెనుకబడింది. దేశంలోని మిగతారాష్ట్రాలతో పోలిస్తే, అట్టడుగుస్థానంలో ఏపీఉందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. జార్ఖండ్ , కేరళకంటే దిగువన ఆంధ్రపదేశ్ ఉంది. టీడీపీప్రభుత్వంలో రాష్ట్రంలో నిరుద్యోగశాతం 3.5ఉంటే, ఇప్పుడు 13.5శాతానికి చేరింది. నిరుద్యోగరేటులో రాష్ట్రం ఆఫ్రికాదేశాలతో (30శాతం నిరుద్యోగరేటు) పోటీపడేలా జగన్ అండ్ కో పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పారిశ్రామికవేత్తల సమ్మిట్ నిర్వహిస్తే, దానిలో 18,643ఎంవోయూలు చేసుకుంది. తద్వారా ఆరాష్ట్రానికి రూ.33లక్షలకోట్ల పెట్టుబ డులు, దాదాపు 93లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగన్ ప్రభు త్వం 378ఎంవోయూలు చేసుకుంటే, 13లక్షలకోట్ల పెట్టుబడులు, 6లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతోంది. పెట్టుబడులుఎలావస్తాయో, ఉద్యోగఉపాధి అవకా శాలు ఎలా లభిస్తాయనే ప్రశ్నలకు ప్రభుత్వం వద్దే సమాధానం లేదు.
పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ ఉపాధిఅవకాశాల కల్పన, రాష్ట్రంలోని వనరులలభ్యత వంటి వాటిపై ఈప్రభుత్వానికి అవగాహన లేదని అర్థమవుతోంది. రాష్ట్రంలోని సహజవనరుల లభ్యతనుబట్టి, ఆయా జిల్లా ల్లోని వనరుల్ని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు రాబట్టడం, అందుకు అవసరమైన పాలసీలు తయారుచేసుకోవడం ప్రభుత్వానికి చాలాముఖ్యం. కానీ జగన్ సర్కార్ ఉత్తుత్తిగా నిర్వహిం చిన గ్లోబల్ సమ్మిట్ లో అలాంటి ఆలోచనలు, లక్ష్యాలు చేయలేదు. రాష్ట్రంలో టెక్స్ టైల్ బిజినెస్ కు ఎక్కువ ఆస్కారముంటే, ప్రభుత్వం ఆ పరిశ్రమల ఊసే విశాఖసమ్మిట్ లో ప్రస్తా వించలేదు. టీడీపీప్రభుత్వం గతంలో చిత్తూరుజిల్లాకు తీసుకొచ్చిన డిక్సన్, సెల్ కాన్ పరిశ్ర మల్ని జగన్ తనసొంతజిల్లా కడపకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కొత్తపరిశ్రమలు తీసుకురాకుండా, ఒకజిల్లాకు నష్టంచేస్తూ, తనజిల్లాకు న్యాయంచేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నించడం దురదృష్టకరం. రాజశేఖర్ రెడ్డి హయాంలో తిరుపతి విమానాశ్రయం సమీ పంలో హిందుస్థాన్ జింక్, రిలయన్స్ బీపీవోసహా, మరికొన్నిపరిశ్రమలకోసం 140ఎకరాలు కేటాయించారు. ఆభూమి ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. పరిశ్రమల ఏర్పాటుపై కోడి.. గుడ్డు..గుడ్డు పిల్ల అవుతుందని గతంలో కథలుచెప్పిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజా గా విశాఖ గ్లోబల్ సమ్మిట్ లోఎంత పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడంటే, ఈ ప్రభుత్వ ఆలోచనలు ఎలాఉన్నాయో ప్రజలు అర్థంచేసుకోవాలి.
విశాఖ గ్లోబల్ సమ్మిట్ .. ఫేక్ సమ్మిట్. జగన్ సర్కార్ నిర్వహించింది నిజమైన సమ్మిట్ అయితే, పెట్టుబడులు ఉద్యోగాల వివరాల్ని, ఎందుకు డాష్ బోర్డ్ లో పెట్టలేదు?
విశాఖ గ్లోబల్ సమ్మిట్ మొత్తం ఫేక్ సమ్మిట్ అని తాము ఘంటాపథంగా చెప్పగలం. కాదు.. తాము రాష్ట్రాభివృద్ధి, యువతభవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన గొప్పసమ్మిట్ అని ప్రభుత్వ చెప్పగలదా? అదే నిజమైతే పరిశ్రమల ఏర్పాటు, అవిపెట్టే పెట్టుబడులు, కల్పిం చే ఉద్యోగాల వివరాలను జగన్ సర్కార్ ప్రజలముందు ఎందుకు ఉంచలేదు? టీడీపీప్రభుత్వం మాదిరి పూర్తివివరాలను డాష్ బోర్డ్ లో ధైర్యం జగన్ ప్రభుత్వం ఎందుకు చేయడంలేదు? ఒ ప్పందాలు చేసుకున్న పరిశ్రమలన్నీ ఎప్పుడు రాష్ట్రంలో తమకార్యకలాపాలు ప్రారంభించి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయనే పూర్తివివరాలను జగన్ అండ్ కో ఎందుకు ప్రజల ముం దు ఉంచలేకపోతున్నారు?”