Suryaa.co.in

Andhra Pradesh

శాసనమండలి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బిజెపి కి మాత్రమే ఉంది

రెండు ప్రాంతీయ పార్టీ ల కు లేదు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

వెంకటగిరి : రెండు ప్రాంతీయ పార్టీ ల వల్ల అభివృద్ధి జరగలేదు.అధికార పార్టీ డిగ్రీ లేని వారికి ఓటు నమోదు చేసింది ఇంత కంటే దుర్మార్గం ఉంటుందా అని ప్రశ్నించారు.అభివృద్ధి కేంద్రం లో నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతోంది.ఇక్కడ వెంకటగిరి లో కూడా అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్ల జరిగింది.అభివృద్ధి విషయంలో బిజెపి చర్చ కు సిద్దంగా ఉంది రెండు పార్టీలు సిద్ధమా అని తీవ్ర స్వరంతో పిలుపు ఇచ్చారు.రహదారులు అభివృద్ధి దగ్గర నుండి సముద్ర తీరం వరకు రకరకాల అభివృద్ధి చేశాం.ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది.ఎన్నికల్లో స్పష్టత ఉన్న పార్టీ బిజెపి మాత్రమే అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.తొలుత వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని పలు విద్యా సంస్థలలో పర్యటించి ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కొరకు అభ్యర్థన.కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎమ్మల్సీ ఎన్నికల కార్యాచరణ పై సమీక్ష చేశారు

 

LEAVE A RESPONSE