– అజ్మీర్ దర్గాలో తెలంగాణ వాసులకు వసతి
రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాలో ఎమ్మెల్సీ కె. కవిత పుట్టిన రోజు పురస్కరించుకొని సోమవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర క్షేత్రమైన అజ్మీర్ దర్గాకు సోమవారం ఉదయం చేరుకున్న హోం మంత్రి దర్గా పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ….. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పవిత్ర అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసామని తెలిపారు. గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా, ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను బిజెపి ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని… కేంద్ర ఏజెన్సీల ను వినియోగించి ఇబ్బందులు పెడుతోందని హోం మంత్రి అన్నారు. ఈ పరిస్థితులను కవిత దైర్యంగా ఎదుర్కొంటున్నారని….. ఈ సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు చేసినట్టు ఆయన తెలియజేశారు. బిఅర్ఎస్ నాయకులు షరీఫ్ఉద్దీన్, ఫూర్ఖాన్ అలీ తదతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
అజ్మీర్ దర్గాలో తెలంగాణ వాసులకు వసతి సదుపాయం:
అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి సదుపాయం కల్పించే విషయమై, స్థానిక అధికారులతో రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీ శాఖ మంత్రి సలెహ్ మహమ్మద్, కలెక్టర్ అన్షిదీప్, అభివృద్ధి విభాగపు అధికారి అక్షయ్ గోదార తదితర అధికారులతో కలిసి వసతి సదుపాయానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు దాదాపు 2.40 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని హోమ్ మంత్రి సందర్భంగా అధికారులకు తెలియజేశారు. వసతి సదుపాయానికి అవసరమైన భూమి కొనుగోలు , రిజిస్ట్రేషన్ ల నిమిత్తం ఈ నిధులను వెచ్చించి త్వరితగతిన పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజ్మీర్ దర్గా తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ , కేరళ రాష్ట్రంలోని శబరిమలై వంటి పుణ్యక్షేత్రాల్లోనూ తెలంగాణ భక్తుల కోసం వసతి సదుపాయాలను నిర్మిస్తుందని హోం మంత్రి ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.