Suryaa.co.in

Telangana

ఇంటర్‌ స్టూడెంట్స్‌కు ఆల్ ది బెస్ట్

– రేపటి నుండి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఒక ప్రకటనలో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఇంటర్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధినీ, విద్యార్ధులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు. పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ జాగ్రత్తలేమిటో వారికి వివరించారు. మంత్రి సింగిరెడ్డి చెప్పిన జాగ్రత్తలివి

-పరీక్షలంటే భయపడవద్దు .. ధైర్యంగా పరీక్షలు రాయాలి
-ప్రశ్నాపత్రం చూడగానే భయపడకూడదు
-సహచర విద్యార్థులతో మన చదువును అస్సలు పోల్చుకోవద్దు
-అర్ధరాత్రి వరకు చదవడం అస్సలు మంచిది కాదు. రాత్రి 10.30 గంటలకు నిద్రపోయి 5.30 గంటలకు నిద్ర లేవాలి
-ప్రతి రోజు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి
-అల్పాహారం తీసుకున్న తర్వాతనే చదవాలి
-పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి
-ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలను దూరంగా ఉండాలి
-చదువుకునేటప్పుడు సెల్‌ఫోన్లు, టీవీలు స్విచ్‌ ఆఫ్‌ పెట్టాలి
-పరీక్షకు వెళ్లే ముందు హాల్‌టికెట్‌ ఉందో లేదో సరిచూసుకుని, ఖచ్చితంగా తీసుకెళ్లాలి
-ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని వెళ్లి చూసుకోవాలి
-పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్‌లు, పెన్సిల్‌, రబ్బర్‌ ముందురోజు సిద్ధం చేసుకోవాలి
-కేంద్రాలకు కనీసం అరగంట ముందైనా వెళ్లి, హాల్‌టికెట్‌ నంబర్లు చూసుకోవాలి
-వేసవి కాలం దృష్ట్యా అందరూ ఉదయం పూటనే టిఫిన్‌ తిని, వాటర్‌ బాటిల్‌ను వెంట తీసుకువెళ్లాలి
-పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, డిజిటల్‌ వాచీలను తీసుకెళ్లకూడదు
-ఓఎంఆర్‌ షీట్‌ను, ప్రశ్నాపత్రాలను ముందుగానే సరిచూసుకుని, హాల్ టికెట్ నంబరు వేసిన తర్వాత పరీక్ష రాయాలి

LEAVE A RESPONSE