• రాష్ట్రప్రజలు ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా సస్పెండ్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది. ఈ ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి ఆఖరికి గవర్నర్ వ్యవస్థను కూడా బలితీసుకోవడానికి సిద్ధమైంది
• 100 నిమిషాలు సభ జరిగితే, టీడీపీసభ్యులకు తూతూమంత్రంగా 4 నిమిషాలు అవకాశం ఇస్తున్నారు.
• తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ భద్రప్రాజెక్ట్, శ్రీశైలం ఎగువన తెలంగాణ నిర్మిస్తున్న అక్రమప్రాజెక్ట్ లపై సభలో ప్రశ్నిస్తానన్న భయంతోనే నన్ను సస్పెండ్ చేశారు
• గవర్నర్ వ్యవస్థ పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎంతగౌరవం ఉన్నాయో ప్రజలకు బాగాతెలుసు.
• గవర్నర్ ను దూషించడం, గవర్నర్ ముఖాన కాగితాలువేయడం, గవర్నర్లను అప్పులకోసంతాకట్టుపెట్టడం…ఇవేనా వైసీపీ గవర్నర్లని గౌరవించే అంశాలు?
• దిశా బిల్లుకి, యాక్ట్ కు తేడా ఏంటో బుర్రకథల బుగ్గనకు తెలుసా? : పయ్యావుల
• సింగిల్ గా వస్తానంటున్న సింహం.. 151ఎమ్మెల్యేలతో 20మంది టీడీపీఎమ్మెల్యేలకు సమాధానంచెప్పించలేక సస్పెండ్ చేయించింది : నిమ్మల రామానాయుడు.
– అసెంబ్లీ ప్రాంగణం బయట విలేకరులతో మాట్లాడిన టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు
టీడీపీఎమ్మెల్యేలకు ప్రభుత్వం మాట్లాడే అవకాశమే ఇవ్వడంలేదు. 100నిమిషాలు సభ జరి గితే, తూతూమంత్రంగా 4నిమిషాలు ప్రతిపక్షసభ్యులకు అవకాశంఇస్తున్నారు. ఆ 4 నిమి షాలు కూడా పూర్తికాకముందే మైక్ కట్ చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే సస్పెండ్ చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుల్ని సభనుంచి సస్పెండ్ చేయగలరుకానీ, సమాజం నుంచి ప్రజలనుంచి సస్పెండ్ చేయలేరు. సమాజం అంటే సువిశాలరాష్ట్రమనే వాస్తవాన్ని ప్రభుత్వం గమనించాలి. సభలో ఒక పెద్దాయన వాస్తవవిరుద్ధంగా బుర్రకథలు చెప్పాడు. ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన అంశాలనే పేర్కొన్నది అని తాను ఇదివరకే చెప్పాను… ఇప్పుడు అదేచెబుతున్నాను. గవర్నర్ పై ఉన్న గౌరవంతో ప్రభుత్వం ఆయనకురాసిచ్చిన తప్పుడువిషయాలకు నిరసనగా తాము నిన్నసభనుంచి వాకౌట్ చేశాం. అంతేగానీ గవర్నర్ పై గౌరవంలేకకాదు. ఇప్పుడున్న గవర్నర్ సుప్రీంకోర్ట్ మాజీన్యాయమూర్తి. ఆయనకు అన్నీ విషయాలు బాగాతెలుసు. గవర్నర్ ప్రసంగాన్నితప్పుపట్టామంటూ మాపై నిందలేస్తూ నీతులు చెబుతున్నవారు, ఒక్కసారి చరిత్రలో వెనక్కువెళితే ఇంతకుముందు ఏంచేశారో తెలుస్తుంది?
అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభా భారతి ఉన్నప్పుడు మీరు ఎలా వ్యవహరించారో ఒక్కసారి రికార్డులు చూసుకోండి. గవర్నర్ రంగరాజన్ ముఖంపైకి కాగితాలు విసిరినవారు మాకు నీతిసూత్రాలు చెబుతున్నారు. ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో గవర్నర్ తో అసత్యాలే చెప్పించింది. దిశాయాక్ట్ బిల్లు గురించి బుగ్గనతో పాఠాలు చెప్పించుకునే దుస్థితి టీడీపీ ఎమ్మెల్యేలకు లేదు. దిశాచట్టంతో ముగ్గురికి ఉరిశిక్ష వేశారన్న మీ కేబినెట్ మంత్రి వ్యాఖ్యలపై బుర్రకథల బుగ్గన ఏంచెబుతాడు? లేని దిశాచట్టాన్ని ఉందని ఎన్నాళ్లు భ్రమింపచేస్తారు. రాజ్యసభలో దిశాచట్టం తిరస్కరించబడింది నిజంకాదా? బిల్లుకి, యాక్ట్ కి తేడా బుగ్గనకుతెలియదు. గవర్నర్లను చట్టసభల్లో దూషించి, వారిముఖాలపై కాగితాలు విసిరేసి, వారిని అప్పులకోసం తాకట్టుపెట్టిన మీరు గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తారా? మీరుబెదిరిస్తే భయపడాలా.. ప్రివిలేజ్ కమిటీలతో ఏంచేస్తారు? ఈ గొంతుఎప్పటికీ ప్రజలపక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది. గవర్నర్ ను సభలో వెయిట్ చేయించారు అని చెప్పాను. గవర్నర్ సభలకు వచ్చినప్పుడు ఎలా ఆయన్ని రిసీవ్ చేసుకోవాలో, ఆయన్ని ఎలా గౌరవించాలో మీకుతెలియదనే అంటాను. గవర్నర్ రెండునిమిషాలు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో కూర్చుంటారని, ఆయన కార్యాలయం నుంచే విజ్ఞప్తి వచ్చినట్టు నేడు సభలో చెబుతున్నారు. అది నిన్ననే ఎందుకు చెప్పలేదు? మేం రూల్ బుక్ లోని అంశాలు ప్రస్తావించాక, కల్పించి మాట్లాడుతున్నారా? గవర్నర్ కార్యా లయం నుంచి ఆయనకు ఏదైనా సందేశంవస్తే, దాన్నిసభలో చదివి వినిపించాలనే నిబంధన ఉంది.
అది మీకు తెలిస్తే మీరు ఎందుకు ఆపనిచేయలేదు? గతగవర్నర్ ను అప్పులకోసం తాకట్టుపెట్టింది మీరుకాదా? రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులకు, గవర్నర్ వ్యక్తిగతహోదాను భంగపరుస్తూ, ఆయనతో సంతకాలు పెట్టించింది మీరుకాదా? గవర్నర్ వ్యవస్థను కాపాడే ప్రయత్నంచేసింది మీరా..మేమా? గవర్నర్ విషయంసహా అనేకఅంశాలు తాము ప్రస్తావి స్తామన్నభయంతోనే సభలో మాకుఇవ్వకుండా, మమ్మల్ని బలవంతంగా బయటకు పంపా రు. ప్రివిలేజ్ కమిటీవేస్తామని బెదిరిస్తే, మేంభయపడాలా? మీరు ఉరితీస్తారా…లేక చంపే స్తారా? మీమాటలు, కేసులకు భయపడతామనుకుంటున్నారా? మీరు ఒకటికాదు.. వంద చేసినా ఈ గొంతు, ప్రజలకోసం ఎప్పటికీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని గుర్తుంచుకోండి. తెలుగుదేశంపార్టీఎమ్మెల్యేలు అందరూ ఇదేపంథాను అనుసరిస్తారు. తుంగభద్రపై అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తున్న కర్ణాటకప్రభుత్వాన్ని, శ్రీశైలంపై అక్రమప్రాజెక్ట్ లు కడుతున్న తెలంగాణప్రభుత్వాన్ని జగన్ ఎందుకు నిలదీయడంలేదు? రాయలసీమఎడారి అవుతున్నా జగన్ చోద్యంచూస్తున్నాడు. ఈఅంశాలు తాను సభలో ప్రస్తావిస్తానన్నభయంతోనే సస్పెండ్ చేశారు. అప్పర్ భద్రపై కర్ణాటకప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్, తెలంగాణప్రభుత్వం శ్రీశైలం ఎగువన నిర్మిస్తున్న అక్రమప్రాజెక్ట్ లపై ప్రభుత్వం ఎందుకు ఆయారాష్ట్రాలను ప్రశ్నించదు? రాయలసీమ ఎడారి అవుతున్నా.. అక్కడిప్రజలకు చివరకు గుక్కెడుతాగునీరుకూడా దొరకని దుస్థితి రాబోతున్నా ముఖ్యమంత్రిలో చలనంలేదు. తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీలో కేసువేశారు.
దానిపై స్టే ఇచ్చారు. స్టే ఉండగాకూడా ఆప్రభుత్వం ప్రాజెక్ట్ ల నిర్మాణాలు కొనసాగించింది. దానికి ప్రత్యక్షసాక్ష్యాలు నావద్ద ఉన్న వీడియోలే. నేనే స్వయంగా ప్రాజెక్ట్ లు నిర్మిస్తు న్నప్రాంతానికి వెళ్లి, అక్కడి దృశ్యాలను చిత్రీకరించాను. ( తనఫోన్ లోని వీడియోలను ప య్యావుల విలేకరులకు చూపించారు) యథేచ్ఛగా రాయలసీమను నాశనంచేసేలా ప్రాజెక్ట్ ల నిర్మాణం జరుగుతున్నా, పక్కరాష్ట్రాలు పరిమితికి మించిపనులు చేస్తున్నా మీరు స్పం దించరు. మీవైఫల్యాలను ఎత్తిచూపితే, మమ్మల్ని సభనుంచి బయటకుపంపుతారా? తెలం గాణప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న లోపాయికారీ ఒప్పందాలే అందుకుకారణం. ప్రాజెక్ట్ ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం పిటిషన్ దశలోనే తెలంగాణకు స్టేవచ్చేలా, సుప్రీంకోర్టులో అస మర్థులైన లాయర్లతో వాదనలు వినిపించింది. సీనియర్ అడ్వకేట్లను పెట్టకుండా, అడ్వకేట్ ఆన్ రికార్డ్ తో వాదనలు వినిపించారు. రాయలసీమను ఎడారినిచేసేలా తెలంగాణనిర్మిస్తు న్న అక్రమప్రాజెక్ట్ లను ఆపడానికి మీరు, మీప్రభుత్వం తీసుకున్నచర్యలు శూన్యం. గ్రీన్ ట్రి బ్యునల్ స్టే ఇచ్చినా ఎక్కడాపనులు ఆగలేదు. సంవత్సరం పాటు నిరాటంకంగా జరిగాయి.
కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కడితే, తుంగభద్రపై ఉన్న (హైలెవల్ కెనాల్) హెచ్.ఎల్.సీపై ఆధారపడిన సీమప్రజలకు అన్యాయమే జరుగుతుంది. హెచ్.ఎల్.సీ ద్వారా32టీఎంసీలు రావాల్సి ఉంటే, 20 సంవత్సరాలనుంచి సారాసగటున 26టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పూర్తయితే, అనంతపురం, కర్నూలు జిల్లాలు నామరూపాలు లేకుండా పోతాయి. ఇలాంటి అంశాలకు సమాధానంచెప్పే ధైర్యంలేకనే మ మ్మల్ని బయటకు పంపారు. ఏదోఒకనాడు ప్రజలకు మీరు సమాధానంచెప్పుకోక తప్పదు. నిజంగా మీకు దమ్ము, ధైర్యముంటే అసెంబ్లీలో తాములేవనెత్తే ప్రశ్నలకు సమాధానంచెప్పం డి. అంతేగానీ బలవంతపు సస్పెన్షన్లతో మమ్మల్ని ఆపలేరు. రాయలసీమకు సంబంధించిన ప్రధాన అంశాల్ని మరుగునపరిచేందుకే మంత్రులు గవర్నర్ ప్రసంగాన్ని ప్రస్తావనకు తెచ్చా రు. నేను మాట్లాడినదాన్ని ప్రభుత్వం వక్రీకరించి, గవర్నర్ వ్యవస్థను తప్పుపట్టినట్టు ప్రచా రంచేస్తున్నారు. సభలో కూర్చున్నాక మమ్మల్ని సస్పెండ్ చేశారు. నిజంగా అదికూడా ఒకరికార్డే.
నిజానికి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసింది నిన్నజరిగిన దానికి సంబంధించి కాదు. ఈరోజు సభలోజరిగిన పరిణామాలదృష్ట్యానే మమ్మల్ని సభనుంచి గెంటేశారు. నేను ఆవేదనతో స్పీక ర్ వద్దకు వెళ్లి ప్రశ్నించాను. కానీ రామానాయుడు కూర్చున్నచోటు నుంచి కదల్లేదు. మరి ఆయనను కూడా బయటకుపంపారు. మేం వెల్ లో ఉంటేనే, గొడవచేస్తేనే సస్పెండ్ చేయాలి. కానీ అంతాఅయిపోయి కూర్చున్నాక, సభ మొదలయ్యాక మూడుసార్లు మాట్లాడక సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి గుర్తుకువచ్చినట్టుంది. అప్పుడుసస్పెండ్ చేశారు. సభ ఆగినప్పుడు సస్పెండ్ చేయడంకూడా ఒకరికార్డే. అసెంబ్లీ ప్రత్యక్షప్రసారం గమనిస్తే, మీకే వాస్తవాలు బోధపడతాయి. సభజరిగేటప్పుడు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో బుర్రకథల మంత్రే కొత్తగా మరోబుర్రకథ చెబుతాడేమో? వాస్తవాలు ప్రజలకు చెబుతున్న మీడియావ్యవస్థల్ని చూసి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోంది. వైసీపీప్రభుత్వం ఎన్నిదుష్ప్రచారాలు చేసినా, ఎన్నికుట్రలు పన్నినా, కొన్ని మీడియా వ్యవస్థలు, వాటిఅధిపతులకు ఉన్న క్రెడిబులిటీను దెబ్బతీయలేదు. ఈ ప్రభుత్వం తననుతాను కాపాడుకోవడానికి గవర్నర్ వ్యవస్థను కూడా బలితీసుకోవడానికి సిద్ధమైంది. పత్రికలు, మీడియా గురించికూడా సభలో పదేపదే ప్రస్తావించారు. వాస్తవాలు మాట్లాడే వ్యక్తులు, వ్యవస్థలను చూసి ప్రభుత్వం వెన్నులో వణుకుపుడుతోంది. ఆయా వ్యవస్థలు, వ్యక్తులపై మీరుఎన్ని అసత్యాలు ప్రచారంచేసినా, ఎన్నినిందలేసినా వారి క్రెడిబులిటీ తగ్గడం లేదు. ప్రజలువారిని విశ్వసిస్తున్నారు కాబట్టే, వారు రాసే వార్తలను కూడా నమ్ముతున్నా రు. మీరు వారిపై ఎన్నిఅసత్యాలు చెప్పినా, ఎన్ని దుష్ప్రచారాలుచేసినా, ఒక్కరుకూడా రోడ్డె క్కి వారివార్తలను ప్రశ్నించడంలేదని గుర్తుంచుకోండి.
మోకాళ్లమీద నిలబెట్టాలా.. వైసీపీ శాసనసభ్యులు మోకాళ్లమీద నిలబెట్టాలి అంటుంటే, మీముఖ్యమంత్రేమో అదేవ్యక్తికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. (జగన్మోహన్ రెడ్డి ఒకపత్రికాధిపతికి వంగినమస్కరిస్తున్న చిత్రాన్ని పయ్యావుల విలేకరులకు చూపించారు). నిజంగా గవర్నర్ ఏదైనా ఇబ్బంది ఉండి స్పీకర్ ఛాంబర్లోకివెళ్తే, ఆ విషయం మాకుచెబితే, మేంసభలో ప్రస్తావించేవాళ్లం కాదుకదా! అదిచేయకుండా గవర్నర్ గురించి రెండున్నరగంటలపాటు సభలో చర్చజరిగేలా చేస్తారా? అలా చేయడంద్వారా ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేసిందా..లేక గవర్నర్ ను టార్గెట్ చేసిందా? సుప్రీంకోర్ట్ నుంచి వచ్చిన ఆయనకు మీకుళ్లు రాజకీయాలు, కుట్రలు తెలియవు కదా! గవర్నర్ వ్వవస్థ బలంగాఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది అని మేం బలంగా న మ్ముతున్నాం. కానీ వైసీపీప్రభుత్వం తనను తానుకాపాడుకోవడానికి ఆఖరికి గవర్నర్ వ్య వస్థను కూడా బలితీసుకునేందుకు సిద్ధమైంది.”
సింగిల్ గా వస్తానంటున్న సింహం.. 151ఎమ్మెల్యేలను ఉంచుకొని, 20మంది టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక సస్పెండ్ చేయించింది : నిమ్మల రామానాయుడు
“అసెంబ్లీలో ప్రభుత్వం నేడుకొత్తకొత్త సంప్రదాయాలకు తెరలేపింది. రివర్స్ ప్రభుత్వం, రివర్స్ ముఖ్యమంత్రి అసెంబ్లీనికూడా రివర్స్ లో నడపాలనిచూస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లా డినదానిలో అసభ్యకర, తప్పుడు పదాలు ఉంటేనే, వెల్ లోకి వెళ్తేనే సస్పెండ్ చేస్తారు. కానీ నేను నా స్థానంలో ఉండగానే స్పీకర్ నన్ను సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రికనుసైగలకు అనుగుణంగా స్పీకర్ నడుచుకుంటున్నారు. ఎవరికి మైక్ ఇవ్వాలో మంత్రులుచెబితే, స్పీకర్ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. 151మంది శాసన సభ్యులు 20మంది ప్రతిపక్షసభ్యులకు సమాధానంచెప్పలేని స్థితిలో ఉన్నారు అనడానికి మమ్మల్ని సస్పెండ్ చేయడమే నిదర్శనం. ప్రశ్నోత్తరాల సమయంలో నాకు సంబంధించినవి రెండుప్రశ్నలున్నాయి. వాటిలో ఏఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. మిగిలిన 7రోజుల్లో ఇంకానేను వేయాల్సినప్రశ్నలు 12ఉన్నాయి. వాటికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేకనే సమావేశాలు ముగిసేవరకు మమ్మల్ని సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, అభూతకల్పనల్ని ఆధారాలతో సహా అసెంబ్లీలో ఎండగడ తానన్నభయంతోనే నన్నుసభనుంచి సస్పెండ్ చేశారు. వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ భరోసా, రైతుభరోసా, విద్య, వైద్యం, వైసీపీప్రభుత్వం, గవర్నర్ తో చెప్పించిన అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాల్ని ప్రజలకు ఆధారాలతోసహా తెలియచేస్తానన్న భయంతోనే బయటకు పంపించారు. రాష్ట్రంలో నిర్మిస్తాము అంటున్న బోగస్ మెడికల్ కాలేజీ బాగోతాన్ని బయటపెడతామన్న భయంకూడా ప్రభుత్వంలో కనిపించింది. సంఖ్యాబలంతో జగన్ అసెం బ్లీలో మాగొంతులు నొక్కవచ్చుకానీ, ప్రజాక్షేత్రంలో మమ్మల్ని నిలువరించలేడు. రాబోయే రోజుల్లో వైసీపీనుంచి సింగిల్ డిజిట్ కూడా అసెంబ్లీకిరాకుండా చేస్తాం. టీడీపీసభ్యుల్ని ఎందుకు సస్పెండ్ చేశారో అన్న అయోమయం స్పీకర్, మంత్రులకుఉంది. టీడీపీఎమ్మెల్యే లను ఒక్కరోజు సస్పెండ్ చేశారా..లేక సమావేశాలు ముగిసేవరకా అన్నదా.. మమ్మల్ని బయటకు పంపినవారికి కూడా తెలియదు.”