Suryaa.co.in

Telangana

పరీక్ష రాస్తుండగా ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని బిందుకు గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న డిపిఆర్డీఓ వెంకటేశ్వర్లు తన వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. 108 అంబులెన్స్ రావడంతో అందులో పంపించారు. అధికారులు అప్రమత్తమై విద్యార్థినిని సకాలంలో ఆసుపత్రికి పంపడం వల్ల ప్రాణాలు కాపాడగలిగారు. ప్రస్తుతం బిందు సురక్షితంగా ఉంది.

LEAVE A RESPONSE