Suryaa.co.in

Andhra Pradesh

మా పార్టీ గూండాల దాడిని ఖండిస్తున్నా

– దీనిపై నేరుగా సీఎం జగన్ స్పందించాలి
– పార్టీ ఎంపీగా బీజేపీ నాయకత్వానికి నేను క్షమాపణ చెబుతున్నా
– అమరావతిపై బీజేపీ స్టాండు సజ్జలకెందుకు?
– రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రలతకు ఇదే సాక్షి
– సత్యకుమార్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
– అమరావతికి మద్దతునిస్తే చంపేస్తారా?
-సత్యకుమార్‌పై దాడిని ఖండిస్తూ ప్రధానికి లేఖ రాశా
– వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై మా పార్టీ గూండాల దాడికి సిగ్గుపడుతున్నా. దీనికి మా సీఎం జగన్ స్వయంగా స్పందిస్తే మంచిది. ఇక్కడ బీజేపీ నేతలపై దాడి చేసి, ఇక్కడ డిల్లీ కొచ్చి వాళ్ల పార్టీ నేతల కాళ్లుపట్టుకునే వ్యూహం సరైంది కాదు. వాళ్ల పార్టీ వారిని ఎలా కాపాడుకోవాలో బీజేపీ నాయకత్వానికి తెలుసు. అమరావతిపై బీజేపీ స్టాండు గురించి సజ్జల మాట్లాడితే ఎలా? ఆయన చెబితే నమ్మేదెవరు? దాడి ఘటనపై అసలు హోంమంత్రి ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణం.

దీన్నిబట్టి హోంశాఖ ఎవరి చేతుల్లో ఉందో పదోతరగతి పిల్లవాడికి సైతం తెలిసిపోతుంది. ఈ దాడి రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ఠ. కేంద్ర హోం శాఖ ఈ దిశగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. తాజా దాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశా. అయినా అమరావతికి ఎవరు మద్దతు ప్రకటిస్తే వారిని చంపేసే ప్రయత్నాలు చేస్తారా?

దేవుడు బీజేపీ నేతల వైపు ఉండబట్టి బతికి బయటపడ్డారు. వారికి ఏమైనా అయితే బాధ్యులెవరు? ఇది కచ్చితంగా వైసీపీ నేతల హత్యాప్రయత్నంగా భావించి నిందితులపై హత్యానేరం నమోదు చేయాలి. బీజేపీ నేతలపై దాడి చేసిన మా పార్టీ గూండాలను తక్షణం అరెస్టు చేయాలి. బీజేపీ నేతలపై మా పార్టీ గూండాలు చేసిన దాడికి పార్టీ ఎంపీగా బీజేపీ నాయకత్వానికి నేను క్షమాపణ చెబుతున్నా.

LEAVE A RESPONSE