Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో జరుగుతున్న సిలికా దోపిడీ, మరో ఓబుళాపురం కుంభకోణం

-ఓబుళాపురం తరహాలోనే పర్మిట్లు ఒకచోట, తవ్వకాలు మరోచోట జరుపుతూ, భారీఎత్తున సిలికాదోపీడిచేస్తూ కుంభకోణానికి పాల్పడుతున్నారు
-3 ఏళ్లలో రూ.3వేలకోట్ల దోపిడీ జరిగింది.
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రాష్ట్రంలో జరుగుతున్న సిలికా దోపిడీపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలి. సీబీఐతో పాటు ఈడీ, ఫెమా, జీఎస్టీ, ఎన్జీటీ విభాగాలు జోక్యంచేసుకోవాల్సినంత అతిపెద్ద కుంభకోణం. కోస్టల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ భూములు, అసైన్డ్ భూములు, డీ.కే.టీ పట్టా భూములు, సొనకాలువలు, ఏపీఐఐ సీ భూములు, సాగరమాల ప్రాజెక్ట్ కింద మార్క్ చేసిన భూములు వేటనీ వదలకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. టన్ను రూ.100కు కొంటూ, రూ.1485కు అమ్ముకుంటున్నారు. జీఎస్టీ మాత్రం రూ.700లకే కడుతున్నారు.వాషింగ్ ప్లాంట్లలో క్లీన్ చేయించి, టన్ను సిలికాను రూ.4వేలకుపైగా అమ్ముతున్నారు. ఈ దోపిడీకి సంబంధించి నెలకు రూ.27 నుంచి రూ.28కోట్లు హైదరాబాద్ కు వెళ్తున్నాయి.

“నెల్లూరు జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లో లభించే రేర్ మినరల్ సిలికా శాండ్ తవ్వకాలకు సంబంధించి 3వేలఎకరాల్లో 78మందికి మాత్రమే లీజులు ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో మైనింగ్ చట్టంప్రకారమే సిలికా మైనింగ్ జరిగేది. వారిలోమెజారిటీ లీజుదారులు వైసీపీ వారే. వారంతా గతఎన్నికలకు ముందు పార్టీ ఫండ్స్ ఇచ్చిమరీ వైసీపీలోచేరారు. టీడీపీ ప్రభుత్వం వారిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందిలేదు. సిలికాన్ మైనింగ్ పై చట్టప్రకార మే జీఎస్టీ విధించారు. వైసీపీప్రభుత్వం రాగానే మొత్తం 3వేలఎకరాల మైనింగ్ భూమిని, 78మంది లీజుదారుల మెడపై కత్తిపెట్టి, రూ.300కోట్ల పెనాల్టీలు వేసింది. ఎవరైతే వైసీపీలోచేరి, ఆపార్టీకి 10వేలఓట్ల మెజారిటీ తీసుకొచ్చారో వారందరిపై పెనాల్టీలు వేశారు. టన్ను సిలికాపై రూ.70లుగా ఉన్న ట్యాక్స్ ను రూ.300లకు పెంచారు. కోవిడ్ ట్యాక్స్ పేరుతో రూ.200లు అదనంగా భారం మోపారు. ఒకటన్ను సిలికా రూ.100కే తీసుకుంటున్నారు. లీజు కాలపరిమితి 5ఏళ్లు, 10ఏళ్లుఉన్నా జాన్తానై అంటున్నారు. విజయసాయిరెడ్డి కంట్రోల్ లో జగన్మోహన్ రెడ్డి నామినీకి టన్ను రూ.100కే తీసుకుంటున్నారు. శివకుమార్ రెడ్డి కంపెనీకి 120కోట్లకు పైగా పెనాల్టీ వేశారు. మొత్తంకలిపి లీజుదారులపై రూ.300కోట్లవరకు వేశారు. సాక్షాత్తూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా రూ.5కోట్ల పెనాల్టీ వేశారు. టన్ను రూ.700లకు, రూ.800లకు అమ్ముకుం టున్నారు.. రూ.100కు కొంటూ గొంతుమీద కత్తిపెట్టి బెదిరిస్తూ దోపిడీ మొదలెట్టారు.

ఈ 3సంవత్సరాల్లో రూ.3వేలకోట్ల సిలికాదోపిడీ జరిగింది. సేల్స్ పాయింట్ సింగిల్ పాయింట్ అయ్యాక టన్ను రూ.1485లకు అమ్ముకుంటున్నారు. జీఎస్టీమాత్రం రూ.700లు కడుతు న్నారు. దాన్ని వాషింగ్ ప్లాంట్లలో క్లీన్ చేసి, టన్ను రూ.4వేలకుపైబడి అమ్ముతున్నారు. జీఎస్టీ 50శాతంఎగ్గొడుతున్నారు. ఒక మైనింగ్ లీజుకావాలంటే 18 అనుమతులుకావాలి. అలాకాకుండా గంటల్లోనే ఏపీఐఐసీకి చెందిన 500ఎకరాల భూముల లీజుపొందారు. ప్రతి 5హెక్టార్లకు ఒక లీజు ఇచ్చేశారు. ఏపీఐఐసీ భూముల్లో సిలికా తవ్వకాలు మొదలెట్టేశారు. దానికి ఏపీఐఐసీ అడ్డుపడి, 15, 20 ఎకరాల్లో ఇల్లీగల్ మైనింగ్ ఆపేసింది. లీజుదారులకు టన్ను రూ.100లకు కొనుక్కుంటూ అక్కడ అదేప్రభుత్వభూముల్లో వేరుశనగ పడించే పేదల భూముల్లో లీజులేని భూముల్లో గొంతులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టి బెదిరిస్తూ టన్ను రూ.30చొప్పున ఎకరాకు30వేల టన్నులు ఎత్తుతున్నారు. ఇంచుమించు ఎకరాకు రూ.4న్నరకోట్లు వస్తోంది. ఎన్విరాన్ మెంటల్ నిబంధనలప్రకారం 2.50 మీటర్ల లోతుకు మాత్రమే తవ్వకాలు అనుమతిస్తే, 5 మీటర్లు, 6 మీటర్లవరకు తవ్వుతున్నారు.

5, 6 మీటర్లవరకు సిలికా తవ్వుతూ, 1485రూపాయలకు అమ్ముకుంటూ, రూ.100కు కొంటూ, రూ.700లకు మాత్రమేట్యాక్స్ కడుతున్నారు. అసైన్డ్ భూమిని సాగుచేసే వ్యక్తికి టన్నుకి రూ.30చొప్పున రూ.3లక్షలు అడ్వాన్స్ఇచ్చి, ఎకరాకు 30వేల టన్నులు ఎత్తుతున్నారు. లైఫ్ లాంగ్ సేద్యంచేసుకునే భూమికి రూ.3లక్షలిచ్చి సెటిల్ చేస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నెల్లూరులో జరుగుతున్నది మరో ఓబుళాపురం కుంభ కోణం. కర్నూలు జిల్లాలో లక్షలటన్నుల సిలికా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. కానీ అక్కడి మెటీరియల్ లో క్వాలిటీ లేదు. అక్కడి అనుమతులతో నెల్లూరుజిల్లాలోని 4, 5వందల ఎకరాల ప్రభుత్వభూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. జీపీఎస్ మ్యాప్ ద్వారా ఈ వ్యవహారం బయటపడుతుంది. ఇప్పుడు వెళ్లినా అక్కడజరిగే తవ్వకాలు చూడొచ్చు. విశాఖపట్నంలో పెత్తనంచేసే నెల్లూరుజిల్లా పెద్దమనిషికి సక్రమంగా సెటిల్మెంట్లు జరగలేదని ఒకవారం నుంచి తవ్విన మెటీరియల్ రవాణాచేయకుండా ఆపేశారు. .

గతంలో నేవీలో పనిచేసిన వెంకటరెడ్డికే డీఎంజీ మరియు ఏపీఎండీసీ అడిషనల్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ మధ్యన చిత్తూరుజిల్లా మంత్రి నేరుగా కాళ్లుపట్టుకుంటున్న ఫొటోలు చూశాం. ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతదోపిడీకి అనుమతిస్తూ మేంసంతకాలు పెట్టలేమని రిజెక్ట్ చేశారు. కర్నూలు అనంతపురం డీడీ మైన్స్ గా రాజశేఖర్ అనేవ్యక్తిని నియమిస్తే, వాళ్లుచెప్పినట్టు సంతకాలు పెట్టలేదని, గంటలోనే ఆయన్ని బదిలీచేయించారు. ఆయన తర్వాత మరోఅధికారిని ఒక్కరోజులో ట్రాన్సఫర్ చేయించారు. వాళ్లుచెప్పినట్టు సంతకాలు పెడితే ఓకే.. లేకుంటే లేదు. ఇప్పటికి దాదాపు 2కోట్లటన్నుల సిలికా శాండ్ ఎత్తేశారు. అనధికారికంగా ప్రభుత్వభూము ల్లో ఇంచుమించు 70 నుంచి 80లక్షల టన్నులు తవ్వేశారు. కోస్టల్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ భూములు, అసైన్డ్ భూములు, డీ.కే.టీ పట్టా భూములు, సొనకాలువలు, ఏపీఐఐ సీ భూములు, సాగరమాల ప్రాజెక్ట్ కింద మార్క్ చేసిన భూముల్లో కూడా బావులుపెట్టేశారు. మట్టిఎత్తితే ఎంతఖర్చు అవుతుందో, తిరిగి దాన్నిపూడ్చాలంటే దానికి వందరెట్లు ఖర్చు అవుతుంది. ఇలా అంతేలేకుండా దోపిడీచేస్తున్నారు.

మాకు తెలిసిన సమాచారం ప్రకారం, సిలికా తవ్వకాలకు సంబంధించి హైదరాబాద్ కు నెలకు రూ.27కోట్ల నుంచి రూ.28కోట్లవరకు జేట్యాక్స్ పోతోంది. దానిలో విశాఖపట్నంలో పెత్తనం చేసే ఆయనకు కొంతపోతోంది. ఆయనచెబితేనే ఇటీవల పర్మిట్లు ఆపేశారు. సెటిల్మెంట్లలో తేడాలొచ్చే ఆపేశారు అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తవ్వకాలు జరిగే ప్రాం తాన్ని పరిశీలించి ఇంతదోపిడీ ఏమిటని ఆశ్చర్యపోయారు. తాము వ్యతిరేకమని చెప్పారు. ఇంత జరుగుతుంటే కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఏంచేస్తున్నారు? చిన్నచిన్న వ్యాపారు లపై జీఎస్టీ కట్టలేదని దాడులుచేసేవారికి, ఇంతభారీ దోపిడీ కనిపించడంలేదా? దేశం..రాష్ట్రం ఏమైపోతోంది?

దమ్ముంటే.. వైసీపీప్రభుత్వంలోని మైనింగ్ మంత్రులు, మైనింగ్ అధికారులు, ఎన్జీటీ విభాగం వెళ్తే అక్కడ జరిగే దారుణమైన సిలికా శాండ్ దోపిడీ కనిపిస్తుంది. 5, 6లక్షల టన్నుల మైనిం గ్ కు సంబంధించిన కొండకు పరదా కట్టేశారు. మావాళ్లు ఫోటోలు తీయడానికి వెళ్తే నిన్నా.. మొన్నా హడావుడిగా రవాణా మొదలెట్టారు. మా ప్రభుత్వంలో 78మంది లీజుదారులు ఎలాంటిఇబ్బంది లేకుండా మైనింగ్ చేసుకున్నారు. వాళ్లను చీమకూడా కుట్టిందిలేదు. వాళ్లను టచ్ చేసిందిలేదు. మమ్మల్ని కాదని వెళ్లి వైసీపీ కండువాలు కప్పుకున్నవారి పరిస్థితి ఏమిటి? వందల ఎకరాలు ఉంచుకొని, 30, 40ఏళ్ల నుంచి మైనింగ్ చేస్తున్న పొనకా శివకుమార్ రెడ్డికి రూ.120కోట్లచిల్లర పెనాల్టీ ఎందుకు పడింది? మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్, ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమెభర్త మైనింగ్ లో 40ఏళ్ల అనుభవం ఉన్నవ్యక్తి, వైసీపీలో చేరాడు. అలాంటి ఆయనకు కూడా జగనన్నఇచ్చిన గిఫ్ట్ రూ.120కోట్ల పెనాల్టీ. రూ.120కోట్ల పెనాల్టీ వేయడంతో దిక్కుతోచక సరెండర్ అయిపోయి, టన్ను రూ.100కే ఇస్తున్నారు. చట్టప్రకారం పోరాడే దమ్ము 78మంది మైనింగ్ లీజు దారులకు లేదా?

వారిలో ఒక్క 5 లేదా 6గురు మా మైనింగ్ చట్టప్రకారమే మా భూముల్లో మా లీజుప్రకారమే జరుగుతోందని, మాకు న్యాయమైన రేట్ వస్తోందని చెప్పగలరా? మెజారిటీ మైనింగ్ ఓనర్స్ పై రూ.300కోట్ల పైచిలుకు పెనాల్టీలు వేశారు. నోరుమూసుకొని ఉన్నారు కాబట్టి 5శాతం వసూలుచేసి వదిలేశారు.. నోరుతెరిస్తే మొత్తం వసూలుచేస్తారు. ఇంత దురాశ అయితేఎలా? 78మంది నోళ్లు మీరుకొడితిరి.. 500ఎకరాల్లో పేదోళ్ల నోళ్లు కొడితిరి. వాళ్లల్లో ఒక్కొక్కరికి కోట్లరూపాయలు వస్తే వారిజీవితాలే మారిపోతాయి. వేల కోట్లు, లక్షలకోట్లు మీరుపెట్టుకొని టన్నుకి రూ.30లుఇచ్చి, పేదలనోళ్లు కొట్టడానికి మనసెలా వచ్చింది? వారి భూములు సాగుకి పనికిరాకుండా పోతే, వారి పిల్లల భవిష్యత్ ఏంటి? శాండ్, సిలికా, ల్యాండ్, వైన్, మైన్ ఏదీ చాలదా? మీరు అమ్మే చెత్తలిక్కర్ తాగి ఎందరు భార్యలు తమభర్తలు కొడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు?

సాగర్ మాలకు మార్క్ చేసిన రోడ్డుని ఎత్తేస్తారా? శ్రీ వామన ఎంటర్ ప్రైజెస్, శ్రీ వామన ఫ్యూచర్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్, గమ్మా మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్, ఈ కంపెనీల బినామీలను అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు చేస్తారా? డైరెక్ట్ గా జీఎస్టీ ఎగ్గొడతా రా? కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ గారు వెంటనే సిలికా మైనింగ్ లో జోక్యంచేసుకోవాలి. సీబీఐతో విచారణ జరిపించాలి. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. జీఎస్టీ, ఇల్లీగల్ మైనింగ్ అన్నీఉన్నాయికాబట్టి సీబీఐతోనే విచారణ జరపాలి. సీబీఐ విచారణ జరిపించి సీతారామన్ గారు న్యాయంచేయాలి. ఇప్పటిదాకా రూ.1485 చొప్పున అమ్మిన వారివద్ద నుంచి ప్రభత్వానికి ఎగ్గొట్టిన ట్యాక్స్ వసూలు చేయండి. అలాగే లీజుదారుల దగ్గర రూ.100కు కొని రూ.1485కు అమ్ముకున్నారో, ఆ డబ్బు ఆ లీజుదారులకు చెల్లించేలా చూడండి. సీబీఐ విచారణలో ఎంతపెద్ద తలకాయలు ఉన్నా కటకటాలు లెక్కపెట్టేట్టు చూడాలని నిర్మలా సీతా రామన్ గారిని కోరుతున్నాం. సోమువీర్రాజు చెప్పినదానికైనా కేంద్రమంత్రిగారు విలువ ఇవ్వాలని కోరుతున్నాం. టీడీపీ ప్రభుత్వంలో రాయల్టీ టన్నుకి రూ.72లు ఉంది. వైసీపీప్రభుత్వం వచ్చాక దాన్ని రూ.348 చేసింది. దానిలో కోవిడ్ ట్యాక్స్ పేరుతో రూ.200లు వేశారు. రూ.348 రాయల్టీ అం టూ ఏదీకట్టకకుండా వేలకోట్ల దోపిడీచేస్తున్నారు. జీఎస్టీ కట్టడంలేదు. ట్యాక్స్ లోనే వందలకో ట్ల దోపిడీ జరుగుతోంది. ఓవరాల్ గా రూ.3వేలకోట్ల దోపిడీ. కర్నూలు జిల్లా నుంచి 14లక్షల టన్నులకు అనుమతులు తెచ్చారు. పర్మిట్ ఒకదగ్గర..తవ్వకాలు మరోదగ్గర చేస్తున్నారు.

ఓబుళాపురం మైనింగ్ తో ఎన్నివేలకోట్లు కొట్టేశారు..ఎంతమంది జైళ్లకు పోయారు. అయినా కనువిప్పురాదా? వైసీపీ నాయకులకు సిగ్గుగాలేదా? కొన్ని కుటుంబాల నోళ్లుకొట్టి వేలకోట్లు సంపాదించి, పోయేటప్పుడు ఎత్తుకుపోతారా? ఉమ్మడిరాష్ట్రంలో సిలికా లభించేది చిల్లకూరు, కోట మండలాల్లోనే. దాన్నికూడా వదలడంలేదు. జగన్మోహన్ రెడ్డికి తన..మన తేడాలేదు. సిలికా మైనింగ్ లలో 60, 70 మైన్స్ వైసీపీ వాళ్లవే. అయినా వారిని కూడా వదలకుండా గుండుకొట్టారు. ఈ దోపిడీలో సీబీఐ, ఈడీ, ఫెమా, జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి విచారణజరపొచ్చు. ఇంతజరుగుతుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంచేస్తున్నారు? ఏ ముఖ్యమంత్రికి తలొగ్గకుండా తలఎత్తుకొని గౌరవంగా బతికేలా వ్యవహరించండి. బెదిరింపులకు లొంగకుండా ప్రభుత్వభూమిని మైనింగ్ కుఇవ్వడానికి నిరాకరించిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. తప్పుడుకేసులు పెట్టారు. నెల్లూరుజిల్లాలో ఎస్పీ, కలెక్టర్ ఏంచేస్తు న్నారు? నేను బాధతో చెబుతున్నాను.. రాజకీయకక్షతో కాదు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ రాకుండా, లీజుదారులకు రావాల్సింది రాకుండా, భూములుసాగుచేసుకొనే పేదలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మీ ప్యాలెస్ కు పోతే సరిపోతుందా?

ఓబులాపురం మైనింగ్ తరహాలోనే సిలికా తవ్వకాల్లో కూడా భారీస్థాయిలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఓబుళాపురం తరహాలోనే పర్మిట్లు ఒకచోట, తవ్వకాలు మరోచోట జరిగినట్టే ఇక్కడ సిలికా కుంభకోణం జరుగుతోంది. సిలికా దోపిడీలో ప్రభుత్వపెద్దలే ముద్దాయిలుగా ఉన్నారు. ఓబుళాపురం కుంభకోణంతో సమానంగా దీన్నికూడా పరిగణించి, విస్తృతస్థాయిలో దర్యాప్తుజరిపించి, దీనివెనక ఎంతటివారున్నా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సిలికా దోపిడీ రూ.3వేలకోట్ల దోపిడీ, సముద్రతీర ప్రాంతంలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారు. రెండున్నర మీటర్లు తవ్వాల్సింది.. 6, 7మీటర్లు తవ్వుతున్నారు. కాబట్టి ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఈ వ్యవహారంపై సాక్ష్యా ధారాలతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ గారికి లేఖరాస్తున్నాం. అవసరమైతే లీగల్ గాకూ డా ఫైట్ చేస్తాం. మాకళ్ల ఎదుట బరితెగించి దోపిడీచేస్తుంటే మేం నోరుమూసుకొని కూర్చోవడా నికి సిద్ధంగా లేం.”

LEAVE A RESPONSE