-కేసుల కోసం హోదా తాకట్టు
-జగన్ ఢిల్లీ వెళ్లేది కేసుల మాఫీ కోసమే
-అప్పులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా?
-పల్నాడు జిల్లా నకరికల్లు మండలo కుంకలగుంట లో టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పర్యటన
-అకాల వర్షానికి దెబ్బతిన్న మిర్చి, ప్రత్తి,మొక్కజొన్న పంటలను పరిశీలించిన కన్నా లక్ష్మీనారాయణ
-పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ
-జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ ధ్వజం
ఎమ్మెల్యేలను జగన్ నాకు తోడు ఉండండి అంటున్నాడు. అంటే జగన్ లో కొత్తగా భయం మొదలైంది.నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంకి ఏమైనా అభివృద్ధి పనులు చేశారా?దాని గురించి నువ్ ఏమన్నా చెప్పగలవా?కేవలం బటన్ నొక్కడం తప్ప సీఎం జగన్ కొత్తగా చేసింది ఏమి లేదు.
రాష్ట్రంలో ఉన్న వనరులను తాకట్టు పెట్టి కొత్తగా పదహారు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు.రెండు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే మిగిలిన నిధులకు శ్వేతపత్రం విడుదల చేయగలరా?ప్రతి సారి జగన్ ఢీల్లీ వెళ్ళేది రాష్ట్రం అభివృద్ధి కోసం కాదు. తన కేసులు, అవినాష్ రెడ్డి కేసులు తొలగించమని వెళుతున్నాడు.ఎన్నికల ముందు తన పాలనలో అవినీతి అనేది ఉండదు అన్నావు.కానీ ఇప్పుడు నీ సొంత ఆస్తులు భారీగా పెంచుకున్నావు.నీ ఆస్తులు పెంచుకోవడానికి కాదు ఆంధ్రా ప్రజలు ఓటేసింది.ఎన్నికల ముందు ఎంపీ గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు. ఎన్నికల తరువాత ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు.