Suryaa.co.in

Telangana

కేసీఆర్ మాత్రం నోరు మెదపకపోవడం సిగ్గు చేటు

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి

రాష్ట్రంలో వరుసగా పరీక్ష పత్రాల లీకేజీలతో విద్యార్థులు, యువత జీవితాలు ఆగమైతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరం.మొన్న TSPSC పరీక్షా పత్రాల లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నిన్న, ఈరోజు టెన్త్ పేపర్ల వరుస లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల్లో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి…

ఎన్ని విమర్శలొచ్చినా… ఎవరెన్ని రకాలుగా చెప్పినా కేసీఆర్ మాత్రం నోరు మెదపకపోవడం సిగ్గు చేటు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు, నిరుద్యోగులపై లేకపోవడం సిగ్గు చేటు. సాధారణంగా పరీక్షలు వస్తున్నాయంటే ఎగ్జామ్ మంచిగా రాయాలని… పరీక్షలో చదువుకున్న సబ్జెక్ట్ పైనే ప్రశ్నలు రావాలని దేవుడ్ని కోరుకుంటారు.. కానీ కేసీఆర్ పాలనలో పేపర్ లీక్ కావద్దని… ఎగ్జామ్స్ వాయిదా పడొద్దని విద్యార్థులు కోరుకునే పరిస్థితి ఏర్పడింది.టెక్నాలజీని దుర్వినియోగడం చేయడంవల్ల TSPSC పేపర్ లీకేజీ జరిగినప్పుడే ఐటీ మంత్రిని బర్తరఫ్ చేస్తే…. ఇప్పడు విద్యాశాఖ జాగ్రత్తగా ఉండేది… టెన్త్ పేపర్ లీక్ కాకుండా ఉండేది…

కానీ అప్పుడు ఐటీ శాఖ సీఎం కొడుకు చూస్తున్నడని.. ఆయన తప్పేమి లేదని.. పెద్ద శుద్దపూస అంటూ వెనకేసుకొచ్చిన్రు… ఏం కాదులే అని ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా ఉంది.. అందుకే టెన్త్ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.తక్షణమే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. 10వ తరగతి తెలుగు, హిందీ పేపర్ల లికేజీ పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ లికేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దు. బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి.

TSPSC పేపర్ లీకేజీ విషయంలో ఇప్పటికైనా TSPSC board ను బర్తరఫ్ చేయాలి. తక్షణమే జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలి. హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలి.

LEAVE A RESPONSE