– నర్సంపేట శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి
రాష్ట్రంలో పరీక్షల లీకేజీ వ్యవహారం లో బీజేపీ కుట్ర కోణం ఉందని మేము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయ .కమలాపూర్ లో బీజేపీ కార్యకర్త ప్రోద్భలం తోనే పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.. బీజేపీ కార్యకర్త ప్రశాంత్ బయటకు తెచ్చిన ప్రశ్నా పత్రాన్ని బండి సంజయ్ కు వాట్సాప్ ద్వారా పంపించార. బాధ్యత గల ఎంపీ గా ఉండి తనకొచ్చిన సమాచారాన్ని బండి సంజయ్ పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే. .బండి సంజయ్ పై రాహుల్ తరహా లో లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిందే. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు పేపర్ లీకేజీల ను కావాలని సృష్టిస్తున్న బీజేపీ కుట్రలను బహిర్గతం చేసేందుకు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలి .