– నాకు అన్నీ తెలుసు
– టీడీపీ ఎంపీ కనకమేడలతో ప్రధాని మోదీ వ్యాఖ్య
ఏపీ పరిస్థితి ప్రస్తుతం పంజాబ్‌లా మారిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసమేతంగా ప్రధానిని కలిసిన సందర్భంగా.. ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు కనకమేడల వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో, భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని మోడీ.. రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్తితి ఎలా ఉందని విచారించారు. ఈ విషయాలు అన్ని నాకు తెలుసు నని, పరిస్థితి పంజాబ్ లాగా తయారైందని తెలియ పరిచారు.
A.P విషయం అన్ని ప్రధాని దృష్టిలో ఉన్నవని. ఆర్ధిక పరమైన మరియు శాంతి భద్రతలు , ఆర్థిక పరిస్తితు లు తన దృష్టిలో వున్నాయని ప్రధాన మంత్రి ప్రస్తావించడం గమనార్హం.5 కోట్ల రాష్ట్ర ప్రజల ను మీరు కాపాడాలని ఎంపీ రవీంద్ర కుమార్ ప్రధానికి విజ్ఞప్తి చేసారు ఆయన సానుకూలం గా స్పందించారు. గతం లో బాబు కూడా ఈ విషయం ప్రధాని దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులు పట్ల కొంత విచారం వ్యక్తం చేశారు.