-జగన్ రెడ్డి! ….ఇకనైనా ఉపాధ్యాయులపై వేధింపులు ఆపు
– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఉపాధ్యాయులపై అనేక కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉండాలా? వద్దా? ఉపాధ్యాయులు చేసిన తప్పేంటి? ఉపాధ్యాయులపై రాజకీయ ఒత్తిడులు తెచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అన్నింటికి ఉపాధ్యాయులను బలిచేస్తున్నారు. న్యాయపరంగా అమలుచేయాల్సిన డిమాండ్లను అమలుచేయకుండా మానసికంగా వేధింపు చర్యలకు దిగుతున్నారు.
తాను అధికారం లోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని, 11వ పిఆర్సీకి ఆమోదం తెలిపి ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా గా నిలుస్తానన్న జగన్ రెడ్డి వాటిని అమలు చేయకుండా నాలుగేళ్ళ నుంచి ఉపాధ్యాయులను దగా చేస్తూనే ఉన్నారు . వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సి. పి.యస్ పై వంచన చేశారు.
హెచ్ ఆర్ ఏ,సి సి ఏ,డీఏ ల్లోనూ ఉద్యోగులను దగాచేసింది. క్వాంటం పెన్షన్ స్లాబుల్లో మార్పు చేశారు. ఇకపై రాష్ట్ర స్థాయి ఫీఆర్సీలు వుండవని,పదేళ్లకొకసారి కేంద్రం వేసే కమిషన్లే ఆధారం అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా ఐ ఆర్ 27శాతం కంటే తగ్గించి 23,29 శాతం ప్రకటించి మోసం చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి వారి ప్రయోజనాలకు పెద్ద పీట వేసిందో ఉద్యోగులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రూ 16 వేలకోట్ల లోటు బడ్జెట్ తో ప్రయాణం ప్రారంభించిన కొత్తరాష్ట్రంలోనే వెనకడుగు వెయ్యకుండా తెలంగాణా ఉద్యోగులతో సమానంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 43 శాతం పిట్ మెంట్ ఇచ్చింది.
10 వ పీఆర్సీ తెలంగాణా ప్రభుత్వం 42 శాతం ఇస్తే గత తెలుగుదేశం ప్రభుత్వం 43 శాతం పిట్ మెంట్ ఇచ్చింది. 29 శాతం పిఆర్ సి ఇవ్వాలని ఉద్యోగులు అడిగితె 10 వ పిఆర్ సి అడిగిన దానికన్నా 14 శాతం అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇకనైనా ఉపాధ్యాయులు జగన్ రెడ్డి మోసాన్ని గుర్తించి వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలి.