Suryaa.co.in

Telangana

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. విశిష్టతలు

డా. బి.ఆర్ .అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా దేశంలోనే అతిపెద్ద లోహ విగ్రహాన్ని
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనుమడు
ప్రకాష్ అంబేద్కర్ ప్రత్యేక అతిధిగా హాజరవుతారు. ఈ విగ్రహ స్థాపనకు ఏప్రిల్ 14 , 2016 లో శంకు స్థాపన చేశారు.
125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం. భూమి నుండి 175 అడుగుల ఎత్తు. పీఠం ఎత్తు
50 అడుగులు.
దేశంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. 2 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ నిర్మాణం.
బేస్‌మెంట్ ఎత్తు 50 అడుగులు. వెడల్పు 45.5 అడుగులు.
వినియోగించిన స్టీల్ 791 టన్నులు. ఇత్తడి 96 మెట్రిక్ టన్నులు.
ప్రక్రుతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహం రూపకల్పన.
మొత్తం వ్యయం రూ.146 .50 కోట్లు. పని చేసిన శ్రామికులు 425 మంది.
విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ రామ్ వంజి సుతార్.
36 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం. అంబేద్కర్ స్మృతివనంలో రాక్ గార్డెన్
ల్యాండ్ స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటేన్స్ , సాండ్ స్టోన్ వర్క్,
జిఆర్‌సి, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్
విగ్రహానికి చేరుకోడానికి మెట్ల దారి, ర్యాంప్.
విగ్రహం కింద పీఠం లోపల గ్రంధాలయం ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ రచనలు అందుబాటులో ఉంటాయి.
బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్..సీలింగ్.
ఈ స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పాకింగ్ చేసేందుకు అవకాశం.

LEAVE A RESPONSE