Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్ తో ఎంపీ జీవీఎల్ భేటీ

– స్టీల్ ప్లాంట్ సామర్థ్యం పెంచేందుకు,లాభాల్లోకి తెచ్చేందుకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన ఇరువురి చర్చ

గత సంవత్సర కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న వర్కింగ్ క్యాపిటల్,ముడిసరుకు మొదలగు విషయాలపై మరియు ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలపై పార్లమెంటులో ప్రశ్నించడం, మాట్లాడటమే కాక ఈ అంశాలపై అనేక మార్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తో,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో,బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో అనేకమంది సంబంధిత కేంద్ర ఉన్నతాధికారుల తో తరచూ సంప్రదిస్తూ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారాన్ని సఫలీకృతం చేసేందుకు జీవీఎల్ చేస్తున్న అనేక ప్రయత్నాల నేపథ్యంలో.. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండితో జీవీఎల్ మరోమారు గంటకు పైగా సమావేశం అవడం జరిగింది.

ఈ సమావేశంలో RINL ప్రస్తుత పనితీరుని సమీక్షిస్తూ రానున్న నెలల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడతోపాటు,లాభాల్లోకి తెచ్చే విధంగా చేయవల్సిన అన్ని ప్రయత్నాల గురించి విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్బంలో స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్ కొత్తగా ముడి సరుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు EOI తో సహా మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలియచేస్తూ, స్టీల్ ప్లాంట్ అభివృద్దికి సమస్యల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలకు గానూ జీవీఎల్ కి ధన్యవాదాలు తెలియచేశారు. గతంలో మూడు పర్యాయాలు స్టీల్ ప్లాంట్ లోని అన్నీ ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించిన జీవీఎల్.. వారి ఉద్యోగ భద్రతకు మరియు ప్లాంట్ అభివృద్దికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE