• ప్రజల మెదళ్లను తొలుస్తున్న పలుప్రశ్నలకు, సీబీఐకి సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి దంపతులదే
• జగన్ వివేకాహత్యజరిగినప్పటినుంచీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి దంపతులు సమాధానం చెప్పాల్సి ఉంది.
• వివేకా గుండెపోటుతో చనిపోయారని సాక్షిమీడియా ఎలాచెప్పిందో దాని నిర్వాహకురాలైన భారతిరెడ్డే సీబీఐకి సమాధానం చెప్పాలి.
• హత్యజరిగిన నాటి అర్థరాత్రి అవినాశ్ రెడ్డి, భారతిరెడ్డి పీఏకి ఫోన్ చేసిఆమెతో ఏం మాట్లాడాడు?
• హత్య జరిగిన వెంటనే భారతిరెడ్డి మేనమామలే ఎవరోచెప్పినట్టు ఘటనాస్థలానికి ఎందుకెళ్లారు?
• వివేకానందరెడ్డి గారి పార్థివదేహానికి కుట్లువేసిన ప్రకాశ్ రెడ్డి, భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి ఆసుపత్రి కాంపౌండర్ కాదా?
• భారతిరెడ్డి పెదనాన్న కొడుకైన ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి ఎందుకెళ్లాడు..వెళ్లి ఏంచేశాడు?
• జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే హత్యకేసు విచారణకు చంద్రబాబు నియమించిన సిట్ ను నీరుగారుస్తూ అడిషనల్ డీఐజీ నేత్రత్వాన్నికాదని ఎస్పీస్థాయి నేత్రత్వానికి ఎందుకు పరిమితంచేశాడు?
• వివేకాకుమార్తె తనతండ్రి హత్యపై సీబీఐ విచారణకోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే జగన్ తాను అంతకుముందువేసిన పిటిసన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడు?
• గజ్జలఉదయ్ కుమార్ రెడ్డిని సిట్ అధిపతి అభిషేక్ మహంతి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంటే, నిందితుడిని వదిలేయాలని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎందుకు చెప్పారు?
• హత్యజరిగిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన శంకరయ్య మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి ఎందుకు నిరాకరించేలా చేశారు? సస్పెన్షన్లో ఉన్న అతనికి జగన్ ప్రభుత్వం ఆఘమేఘాలపై తిరిగి పోస్టింగ్ ఎందుకిచ్చింది?
• కడప ఎంపీ టిక్కెట్ వివాదమే వివేకాను బలితీసుకున్నది నిజంకాదా? వివేకా చనిపోయిన మరుసటిరోజునే జగన్ అవినాశ్ రెడ్డిని ఎందుకు కడపఎంపీ అభ్యర్థిగా ప్రకటించాడు?
-టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం పట్టాభిరామ్ విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!
“వివేకానందరెడ్డిహత్య వెనుక కుటుంబసభ్యులే ఉన్నారని టీడీపీ తొలినుంచీ చెబుతోంది. కానీ జగన్ చేతిలో సొంతమీడియా ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రజల్ని నమ్మించడానికి పిచ్చి రాతలతో తప్పుడుప్రచారం చేయించాడు. ఇప్పుడు సీబీఐవిచారణలో రోజుకొకటిగా బయట పడుతున్న వాస్తవాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు సమాధానం దొరికినట్టు అర్థమవుతోంది.
వివేకాహత్యకేసులో సీబీఐ ఇప్పటివరకు విచారించింది కేవలం పాత్రధారుల్నే. అసలు సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డిలను విచారిస్తేనే కేసు కొలిక్కి వచ్చినట్టు.
వై.ఎస్.భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి లాంటివాళ్లంతా కేవలం పాత్రధారులే. వెనకున్న సూత్రధారులు తాడేపల్లి ప్యాలె స్ లో ఉన్నారు. భాస్కర్ రెడ్డిని, అవినాశ్ రెడ్డిని, ఇతరుల్ని అరెస్ట్ చేసి విచారించినంతమాత్రా న వివేకాహత్యకేసు మిస్టరీ వీడినట్టుకాదు. అసలు సూత్రధారులైన జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య శ్రీమతి భారతిరెడ్డిలకు కూడా సీబీఐ నోటీసులిచ్చి విచారించాల్సిందే. జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిల పాత్రకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఐ ఆ దంపతులిద్దరినీ విచారించాల్సిన అవసరం ఏమిటనేది ప్రజలకు కూడాతెలియాలి. అందుకే వివేకా హత్యోదంతంలోని కొన్నిచిక్కు ప్రశ్నలను ప్రజలముందు ఉంచుతున్నాం. ఈ ప్రశ్నల కు సమాధానాలు రాబడితేనే సీబీఐ వివేకాహత్యకేసును ముగించినట్టు లెక్క.
భారతిరెడ్డి గారు సీబీఐకి, రాష్ట్రప్రజలకు సమాధానంచెప్పాల్సిన 5 ప్రశ్నలు. ఆమె సీబీఐ ఎదుట నోరువిప్పితేనే, ఈ ప్రశ్నలు ప్రజల మెదళ్లనుంచి తొలగిపోతాయి.
ప్రశ్న-1 : వివేకాహత్యజరిగిన నాటి అర్థరాత్రి శ్రీమతి భారతిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు నవీన్ కు అవినాశ్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశాడు? ఆ ఫోన్ ద్వారా భారతిరెడ్డిగా రితో అవినాశ్ రెడ్డి ఏం మాట్లాడారు? అమ్మా మీరుచెప్పిన పని దిగ్విజయంగా పూర్తిచేశా మని చెప్పడానికి అవినాశ్ రెడ్డి, శ్రీమతి భారతిరెడ్డి పీఏకి ఫోన్ చేశారా? హత్యానంతరం చేప ట్టాల్సిన సాక్ష్యాలు రూపుమాపే కార్యక్రమంలో భాగంగా సలహాలు, సూచనలు తీసుకోవడా నికి ఫోన్ చేశారా?
ప్రశ్న-2 : భారతిరెడ్డి తండ్రిగారైన ఈ.సీ.గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ ప్రకాశ్ రెడ్డిని శవాన్ని కుట్లు వేయించడానికి తీసుకెళ్లారా..లేదా? అవినాశ్ రెడ్డి భారతిరెడ్డిగారికి ఫోన్ చేసినప్పుడు, మా తండ్రిగారి ఆసుపత్రిలోని కాంపౌండర్ ప్రకాశ్ రెడ్డి సహాకారంతో, గొడ్డలి పోట్లకు గురైన వివేకాశవానికి కుట్లు వేయించమని అవినాశ్ రెడ్డికి చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే భారతిరెడ్డిని విచారించాలి కదా!
ప్రశ్న- 3 : వివేకాహత్యజరిగిన వెంటనే ఎవరోచెప్పినట్టు భారతిరెడ్డి కుటుంబసభ్యులైన వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.ప్రతాప్ రెడ్డి, వై.ఎస్. ప్రకాశ్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి (వీరంతా భారతిరెడ్డిగారికి స్వయానా మేనమామలు) ఎందుకు ఘటనా స్థలానికి వెళ్లారు? అక్కడికి వెళ్లి రక్తపుమరకలు తుడిచేయడం.. సాక్ష్యాలుమాయం చేయడం.. శవానికి కుట్లు వేయిం చడం వంటిపనులు చక్కబెట్టారు. భారతిరెడ్డి గారి సూచనలతోనే వారు ఆ పనులన్నీ చేసి దగ్గరుండి వ్యవహారం నడిపించారా?
ప్రశ్న- 4 : భారతిరెడ్డి అన్న ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డి (భారతిరెడ్డిగారి పెదనాన్న, వేముల మండలవాస్తవ్యుడు అయిన పెద గంగిరెడ్డి కొడుకు) మర్డర్ జరిగిన వెంటనే వివేకా ఇంటికి ఎందుకెళ్లారు? ఏమ్మా భారతిరెడ్డిగారు మీరే సాక్ష్యాలు రూపుమాపే కార్యక్రమానికి మీ అన్నను పురమాయించారా? (అదే ఈ.సీ.సురేంద్రనాథ్ రెడ్డికి తరువాత 2020లో నజరానా గా వైఎస్సార్ అర్కిటెక్చర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు అప్పగించారు). ఆ పదవి ఎందుకిచ్చారో కూడా భారతిరెడ్డిగారు సీబీఐకి చెప్పాలి.
ప్రశ్న-5 : హత్యజరిగినప్పుడు భారతిరెడ్డిగారి ఆధ్వర్యంలో నడుస్తోన్న సాక్షి ఛానెల్ లో వివేకా గుండెపోటుతో చనిపోయారని కథనాలు ప్రసారంచేశారు. సాక్షి పత్రికలో కూడా అలానే తప్పుడురాతలు రాశారు. ప్రపంచాన్ని నమ్మించడానికి వివేకా గుండెపోటుతో చనిపోయారని మీ మీడియాలో ఎందుకు ప్రచారంచేశారో మీరే జవాబు చెప్పాలి కదా భారతిరెడ్డిగారు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాలంటే సీబీఐ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారిని విచారించాల్సిందే.
జగన్మోహన్ రెడ్డి నోరువిప్పి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. వివేకా కుమార్తె సునీత జగన్ ను కలిసిన సందర్భాల్లో ఆయన అన్నమాటలు కూడా ఆయనతీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇక జగన్మోహన్ రెడ్డిని సీబీఐ ఎందుకువిచారించాలో కూడాచెబుతూ, ఆయనకు సంబం ధించి, ఆయనమాత్రమే స్పందించాల్సిన కొన్నిప్రశ్నల్ని ప్రజలముందు ఉంచుతున్నాను.
ప్రశ్న-1 : రాష్ట్రప్రజల దౌర్భాగ్యం కొద్దీ 2019 మే30న జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే మరేపని లేదన్నట్టు చంద్రబాబుప్రభుత్వం వివేకాహత్యకేసు విచారణకోసం నియమించిన సిట్ దర్యాప్తుకు మోకాలడ్డే నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 13, 2019న అడిషనల్ డీజీ స్థాయి అధికారి నేత్రత్వంలో పనిచేస్తున్న సిట్ ను నీరుగారుస్తూ, కేవలం ఒకఎస్పీస్థాయి అధికారి నేత్రత్వంలో పనిచేసేలా దానిస్థాయిని ఎందుకు తగ్గించారు?
ప్రశ్న- 2 : వివేకాహత్యజరిగిన నాలుగురోజుల తర్వాత సీబీఐ విచారణకోరి, ముఖ్యమంత్రి అయ్యాక దాన్నిమర్చిపోయారు. దానిపై వివేకాకుమార్తె సునీత సీబీఐ విచారణకోరుతూ, జ నవరి 24, 2020న హైకోర్టుమెట్లు ఎక్కారు. కానీ ఆశ్చర్యకరంగా అదిజరిగిన రెండువారాల్లోనే ఫిబ్రవరి06, 2020న జగన్ రెడ్డి, గతంలో సీబీఐవిచారణ కోరుతూ వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నాడు. అన్నగా జగన్ కు చెల్లిపై ప్రేమ, ఆమెకష్టాలపై ఏమాత్రం బాధ్యతఉన్నా, అలాంటిపనిచేయడు. ఎందుకు ఆపని చేశాడో కూడా జగన్ చెప్పాలి?
ప్రశ్న- 3 : అవినాశ్ రెడ్డికి అత్యంతసన్నిహితుడు, వివేకాహత్యకేసులో కీలక నిందితుడు అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఒకానొక సందర్భంలో సిట్ బృందానికి అధిపతిగా ఉన్న అభిషేక్ మహంతి విచారణనిమిత్తం కడపకు తీసుకెళ్తుంటే, మార్గమధ్యంలోనే తాడేపల్లి కొంపనుంచి ఫోన్ చేసి, అతన్ని విడిపించారు. ఆ సంఘటన జరిగినవెంటనే అభిషేక్ మహంతిని లాంగ్ లీవ్ పై జగన్ రెడ్డి ఎందుకు పంపించారు?
ప్రశ్న – 4 : సీఐ శంకరయ్యకు 164 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చి, మేజిస్ట్రేట్ ముందు ఆయ న తనవాంగ్మూలం ఇవ్వడానికి ఒప్పుకొని, తరువాత ఎందుకు ఇవ్వనన్నాడు? వాంగ్మూ లం విషయంగా అడ్డంతిరిగిన వెంటనే అప్పటివరకు సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యకు జగన్ రెడ్డి గారు ఆఘమేఘాలమీద తిరిగి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు. మీరు చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుండా నిరాకరించాడని ఇచ్చారా? హత్యజరిగిన వెంటనే ఘటనా స్థలా నికి వెళ్లి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు వత్తాసు పలికినందుకు ఇచ్చారా?
ప్రశ్న – 5 : డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్దకు వివేకాహత్యకేసు నిందితులైన శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలను జగన్ ప్రత్యేకంగా ఎందుకు పంపించారు? ముఖ్య మంత్రి హోదాలో ఉండి, నిందితుల్ని కాపాడేలా, రాష్ట్రపోలీస్ అధిపతి పై ఒత్తిడి తీసుకురావ డం జగన్ కు కరెక్టేనా?
ప్రశ్న – 6 : కడప ఎంపీ టిక్కెట్ వివాదమే వివేకాను బలితీసుకున్నది నిజంకాదా? వివేకా చనిపోయిన మరుసటిరోజునే జగన్, అవినాశ్ రెడ్డిని ఎందుకు కడపఎంపీ అభ్యర్థిగా ప్రకటిం చాడు?
ప్రశ్న-7: వివేకాహత్యకేసు విచారణలో సీబీఐ శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచిన రోజున, (19-11-2021) అవినాశ్ రెడ్డి అక్కడికివెళ్లి ఎందుకు వీరంగం వేశా డు? ముఖ్యమంత్రి అండతోనే ఆపని చేశాడా? అదేరోజున జగన్ సాక్షాత్తూ అసెంబ్లీలో అవినా శ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇస్తూ అతన్ని ఎందుకు వెనకేసుకొచ్చాడు?
ఇవేగాక వివేకాహత్యజరిగింది మొదలు అనేకసందర్భాల్లో జగన్ వ్యవహరించిన తీరు, మాటమార్చిన విధానం కూడా ఆయనపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. డాక్టర్ సునీత ఒకసందర్భంలో మాట్లాడుతూ, తనతండ్రి హత్యకేసు విచారణసరిగా జరగడంలేదని, హత్యలో ప్రధానభూమిక పోషించిన అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరితే జగన్ ఏమన్నాడు? “అవినాశ్ రెడ్డిని విచారిస్తే ఏమవుతుంది.. అతనిపై కేసుపెడితే బీజేపీలో చేరతాడు” అని జగన్ అనడం ఎంతవరకు కరెక్ట్? వివేకాహత్య వ్యవహారం జగన్ కు తెలుసు కాబట్టే, తన తోలుబొమ్మలైన అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడటానికి ప్రయత్నిం చాడు…ప్రయత్నిస్తున్నాడు. తాను రచించిన వివేకా మర్డర్ స్క్రిప్ట్ లో పాత్రధారులైన వారిని రక్షించడానికి జగన్ తన అధికారం, పలుకుబడి, పరపతి అన్నీ ఉపయోగించాడు. ఇన్నిచేసిన ముఖ్యమంత్రిని సీబీఐ విచారించకపోతే, హూకిల్డ్ బాబాయ్ ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగానే మిగులుతుంది.
సీబీఐ ప్రశ్నలకు స్పందిస్తే పిల్లిమాదిరి కాపురాలు మార్చే బాధ్యత జగన్ కు ఉండదు. ఇక ఆయన ఆఖరి కాపురం చంచల్ గూడ్ జైల్లోనే
వివేకాహత్యకేసులో ప్రజలమెదళ్లు తొలిచేస్తున్న అనేక భేతాళప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సీబీఐవిభాగం కచ్చితంగా ముఖ్యమంత్రి దంపతుల్ని విచారించాల్సిందే. జగన్ పులివెందుల పిల్లి కాబట్టే పిల్లిలాగా కాపురాలు మారుస్తున్నాడు. ఇడుపులపాయ, లోటస్ పాండ్ , తాడేపల్లి ప్యాలెస్ లో కాపురాలు అయిపోయాయి. ఇప్పుడు వైజాగ్ ప్యాలెస్ కు మకాం మార్చాలని చూస్తున్నాడు. కానీ ఇక ఆయన శాశ్వత కాపురం చంచల్ గూడ జైలే. వైజాగ్లో కాపురం పెట్టకముందే, జగన్ కాపురం చంచల్ గూడ జైల్లో ప్రారంభం అవుతుంది.” అని పట్టాభిరామ్ తేల్చిచెప్పారు.