-పైగా మాపైనే రాళ్ళ దాడులు చేసి, రౌడీలు, గూండాలని ఎల్లో మీడియాలో రాతలా..?
– ఎవరు ఎవరిపై దాడి చేశారో కాణిపాకంలో ప్రమాణం చేద్దామా..?
– క్షమాపణలు చెప్పేంతవరకు నిరసనలు ఆగవు..
– చంద్రబాబే టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి మాపై దాడి చేయించాడు
– మేం కూడా ఆవేశపడితే పరిస్థితి మరోలా ఉండేది
– మరో కారంచేడు, చుండూరులా మారణహోమం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు
– ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారని మాట్లాడిన బాబు నాడు క్షమాపణలు చెప్పలేదు కాబట్టే “దళితులు ఏం పీకారు” అంటూ లోకేశ్ దురుసు వాఖ్యలు
– మాకు అంగబలం, అర్ధబలం లేకపోవచ్చు… కానీ మేం ఏం పీకుతామో చూపిస్తాం
-: మంత్రి ఆదిమూలపు సురేష్
చంద్రబాబుది దళిత వ్యతిరేక డీఎన్ఏః
– ఎర్రగొండపాలెంలో శాంతియుత వాతావరణాన్ని చంద్రబాబు కలుషితం చేశాడు
– దళితులను కించపరిచి తప్పించుకు తిరిగితే మేం నిన్ను వదిలేదే లేదు
– రాళ్ల దాడికి పాల్పడ్డ వారి పేర్లు కూడా మేం చెప్తాం- దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– నేషనల్ హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం కల్పించినందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి
– ఎల్లో మీడియా- ఆంధ్రజ్యోతిలో కంటికి గాయమైన ఫోటో వేశారు
– వాళ్ల జెండా కర్ర తిప్పుతుంటే.. వారికి గుచ్చుకుని అతనికి కంటికి గాయమైతే మేం రాళ్లు వేస్తే కంటికి దెబ్బతగిలింది అని మాపై అభాండాలు వేస్తున్నారు
– మాపై రాళ్లు విసిరింది మీరు… ఆ విజువల్స్ అన్ని టీవీల్లో కనిపిస్తున్నాయి. మళ్లీ దొంగే దొంగా దొంగా.. అన్నట్లుంది. తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.
– దళితులను మేము ఏమైనా అంటాం.. వాగుతాం.. కానీ, మీకు మేము క్షమాపణ చెప్పేది లేదన్న అహంకారం చంద్రబాబు, ఆయన కొడుకుది.. దళితులుగా మేం నిరసన వ్యక్తం చేస్తే మరో మారణ హోమం సృష్టిస్తాను అన్నట్లు చంద్రబాబు వైఖరి ఉంది
– మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రాంతానికి వచ్చి, వాహనం లోపల నుంచి చంద్రబాబు బయటకు వచ్చి దళితులకు వేలు చూపించి బెదిరించాడు.
– దళిత సంఘాల ప్రతినిధులను బెదిరిస్తూ.. టీడీపీ అల్లరిమూకలును రెచ్చగొట్టి రాళ్ల దాడి చేయించాడు
– మేము క్షమాపణ కోరితో మా మీద రాళ్ల దాడి చేసి, మా రక్తం కళ్లచూస్తారా..?. దళితులపై దాడులు చేయించడం, వారి రక్తాన్ని కళ్ళ చూడటం, దళితుల వ్యతిరేక భావజాలం చంద్రబాబు డీఎన్ఏలోనే ఉంది.
దళితులకు నిరసన తెలిపే హక్కు లేదా..?:
– దళితులకు నిరసన తెలిపే హక్కు, అధికారం లేదనే అహంకారం చంద్రబాబులో కనిపిస్తోంది.
– చంద్రబాబు అక్కడ ఏమాత్రం ఆగడానికి అవకాశమే లేకపోయినా కావాలని వాహనం ఆపి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టాడు
– మళ్లీ మరో కారంచేడు, చుండూరు లాంటి మారణహోమం సృష్టించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడు
– ఒక కుట్రతో ముందస్తు పథకం ప్రకారమే చంద్రబాబు ఇలాంటి దాడిచేయించాడు
– దారి మధ్యలో ఒక గంటసేపు వాహనం ఆపి అందర్నీ కూడేసుకుని రాళ్లు, రాడ్లు తీసుకుని మా మీద దాడిచేశారు
– ముగ్గురు మా పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు…కంబంపాడు దళిత సర్పంచ్ ఆదాం, జడ్పీటీసీ కో ఆప్షన్ సభ్యుడు షాబిర్ భాషాతో పాటు మరొకరికి తలలు పగిలి కుట్లు పడ్డాయి.
– చంద్రబాబు ఎర్రగొండపాలెం రావడానికి భయపడి.. ముందే పథకం ప్రకారం అందర్నీ పోగేసుకున్నాడు
క్షమాపణ చెప్పే వరకూ బాబును వదిలేది లేదు:
– దళితులపై తండ్రీకొడుకులు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. చంద్రబాబు పర్యటనకు ఒక రోజు ముందే మేం నిరసనకు పిలుపునిచ్చాం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం..
– క్షమాపణ చెప్పండి..మీ వాఖ్యలను వెనక్కు తీసుకోండి.. అని నల్ల బెలూన్లు, చొక్కాలతో నిరసన తెలియజేశాం.
– గతంలో చంద్రబాబు చేసిన వాఖ్యలకు ఇప్పటి వరకూ క్షమాపణ చెప్పలేదు కాబట్టే, ఈ రోజు ఆయన తనయుడు లోకేశ్ దళితులు ఏం పీకారు.. అంటూ మాట్లాడాడు
– ఈ దేశానికి అత్యంత ప్రజాస్వామ్యయుత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఒక దళితుడే అన్నది తెలుసుకో లోకేశ్..
– అవకాశాలు ఇస్తే.. దళితులు అద్భుతాలు చేయగలరని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది దళితులకు అవకాశం ఇచ్చారు
– దళితులు శుభ్రంగా ఉండరని, మురికి వాడల్లో ఉంటారని ఆనాడు నీ క్యాబినెట్ సహచరులు మాట్లాడినా.. నీవు ఖండించలేదు.
– ఈ రోజు నీ కొడుకు రెండాకులు ఎక్కువ చదివి దళితులు ఏం పీకారు.. అని అంటున్నాడు
– మాకు అంగబలం, అర్ధబలం లేకపోవచ్చు…కానీ మేం ఏం పీకుతామో, మా తడాఖా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తాం…
– మాకు ఏ బలం లేకపోయినా ..ఓటు బలం ఉందని మర్చిపోవద్దు చంద్రబాబూ..
దాడిపై పచ్చ మీడియా పిచ్చి రాతలు:
– చంద్రబాబుపై రాళ్ల దాడి అంటూ పచ్చ మీడియా తప్పుడు రాతలు రాసింది
– దాడి జరిగింది మాపైన.. గాయపడింది మావారైతే.. పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది
– నువ్వు ఎన్నిసార్లు రాళ్ల దాడిచేసినా, మా రక్తం కళ్లచూసినా.. క్షమాపణలు చెప్పే వరకూ నిన్ను వదిలిపెట్టం బాబూ..
– క్షమాపణ చెప్పమని అడగడం తప్పా…అడిగితే నువ్వు చేసే పని ఇదా..
– నువ్వు ఎన్ని బెదిరింపులు చేసినా మేం భయపడం, వెనుకాడేది లేదు
– నిన్న మీడియా వారే… నన్ను, నా క్యాంపు ఆఫీసును, ఇంటిని వారు తగలబెడతారట అని ప్రశ్నించారు.
– నేను అందుకే నా ఇల్లు, ఆఫీసు కాదు.. నన్నే తగులబెట్టండని చెప్పాను
– దానికి నేను రౌడీయిజం చేశానంటూ నాపై అభాండాలు వేస్తున్నారు
– మీకు ఎల్లో చానళ్లు ఉండొచ్చు..దళిత వ్యతిరేక భావజాలానికి వత్తాసు పలికే దళిత నాయకులు మీ పార్టీలో ఉండొచ్చు
– మీ మీడియాలో మమ్మల్ని రౌడీలుగా, గూండాలుగా చిత్రీకరించవచ్చు…కానీ వాస్తవాన్ని ఎవరూ వక్రీకరించలేదు
– తెలుగుదేశం శ్రేణులు మా ఆఫీసుపైన ఎలా రాళ్ళ దాడి చేస్తున్నాయో.. వీడియోను మీడియాకు విడుదల చేసిన మంత్రి సురేష్.. వీడియో చూసైనా.. నా గురించి మాట్లాడుతున్నవారు వాస్తవాలు తెలుసుకోండి.
– నా గురించి మాట్లాడుతున్న టీడీపీ నాయకులను అడుగుతున్నా… చంద్రబాబు, లోకేశ్ దళితులను అవమానించారా.. లేదా.. మీ ఆత్మ సాక్షిని అడగండి.
– వాళ్లన్న మాటలకు మేం క్షమాపణ అడగడం కూడా తప్పా…దళితులుగా మేం క్షమాపణ కూడా అడగకూడదా..?
– మమ్మల్ని నిత్యం అత్మన్యూనత భావంలోకి నెట్టేస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా..?
ఎవరిపై దాడి జరిగిందో కాణిపాకంలో ప్రమాణం చేద్దామా..?:
– నేను ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా కాదు.. ఒక దళితుడిగా మిమ్మల్ని క్షమాపణ చెప్పమని నిరసనలో పాల్గొన్నాను.
– దళితులను కించపరిచి ఒక దళిత నియోజకవర్గంలోకి చంద్రబాబు వస్తుంటే క్షమాపణ చెప్పి రావాలని దళిత సోదరులంతా కోరారు
– వారి నిరసనకు, నేను శాంతియుతంగా మద్దతు తెలిపాను..
– చంద్రబాబు కాన్వాయ్‌లో ఉన్న ఎన్ఎస్జీ కమాండెంట్స్ .. మా శ్రేణులపైకి రావడమేమిటి ..?
– టీడీపీ శ్రేణులను ఉసిగొల్పుతూ ఆయన ఎందుకు ముందుకు వచ్చాడు..?
– కళ్లు లేని కబోదిలా, చెవిటి వారిలా ఎల్లో పత్రికలకు వాస్తవాలు కనిపించవు, వినిపించవు. దళితుల మీద దాడి చేసిన చంద్రబాబుకు వత్తాసుపలకడానికి ఎలా మనసు వచ్చింది..?
– ఎవరు ఎవరిపై దాడి చేశారో.. కాణిపాకం వినాయకుడు వద్ద ప్రమాణం చేద్దామా..? రాళ్లు వేసింది ఎవరు..? దాడి చేసింది ఎవరు..?
– నిజం నిప్పు లాంటిది ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని దహించివేస్తుంది
– మీరు క్షమాపణ చెప్పేంతవరకూ ఈ నిరసనలు ఆగవు..
– ఇది ఎర్రగొండపాలెంతో ఆగిపోదు…ప్రతి ఎస్సీ నియోజకవర్గంలోనూ ఇలానే నిరసనలు చేస్తాం
– మేం క్షమాపణ చెప్పేది లేదనేదే మీ భావజాలం అయితే మీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు
– మీరు రాళ్ల దాడి చేసి, తలలు పగులకొడితే మేం బెదిరేది లేదు…మేం పోరాడుతూనే ఉంటాం
– మా జగనన్న మాకు సాధికారత, ఆత్మగౌరవం ఇచ్చారు.
– మీరు దళితుల మధ్య విభేదాలు సృష్టిస్తూ కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు
– రాబోయే రోజుల్లో దళితులు మీకు గట్టి సమాధానం చెబుతారు.
జనం రాకనే బాబు డైవర్షన్ పాలిటిక్స్:
– ఎర్రగొండపాలెం వచ్చి చంద్రబాబు మాట్లాడింది నేషనల్ హైవే నడిబొడ్డున. మీరు ఎక్కడ స్టేజ్ కట్టుకున్నారు..? ఎందుకు అక్కడకు వెళ్లలేదు..?
– అక్కడకు వెళితే అన్నీ కాళీ కుర్చీలు దర్శనమిస్తాయని, తనకు తెలిసిన విద్యతో ఇరుకు సందుల్లో మీటింగు పెట్టుకుని మమ్మల్ని రెచ్చగొట్టి, ఎల్లో మీడియాలో హైలెట్ కావాలని చూశారు.
– ఆయన చేసిన ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంది
– నేను కుప్పిగంతులు వేయడం కాదు చంద్రబాబూ.. జగన్మోహన్రెడ్డి గారి ముందు నీ కుప్పిగంతులు చెల్లవు
– మేం కూడా ఆవేశపడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.