Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సాయి కల్యాణి కుటుంబసభ్యులు

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం సంబంధించిన పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడును తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి కుటుంబసభ్యులతో కలిశారు.

గన్నవరం తెదేపా కార్యాలయం ద్వంసం ఘటనలో సాయి కల్యాణిపై రెండు కేసులు పెట్టిన రోజు నుంచి అరెస్టయిన అనంతరం బెయిల్ పై జైలు నుంచి విడుదల అయ్యేవరకు, అలాగే ఆమె భర్త సురేంద్రకుమార్, బావ అరుణ్ కుమార్ లపై పెట్టిన అక్రమ కేసులో బెయిల్ వచ్చేవరకు కుటుంబ సభ్యులకు అనుక్షణం అండగా నిలవడమే కాకుండా నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన చంద్రబాబుకి ఈ సందర్భంగా సాయి కల్యాణి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ నేపద్యంలో పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసానిస్తూ ధైర్యం చెప్పారు.

LEAVE A RESPONSE