Suryaa.co.in

Andhra Pradesh

ముమ్మరంగా కొనసాగుతున్న తిరుపతి స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు

-పూర్తయిన బేస్మెంట్ ఫ్లోర్ యొక్క రూఫ్ స్లాబ్ కాస్టింగ్ పనులు
-ఎయిర్ కాన్కోర్స్ ఫౌండేషన్‌ల పనుల పరంగా 4, 5 మరియు 6 ప్లాట్‌ఫారమ్‌లలో 90% పని పూర్తి ప్లాట్‌ఫారమ్ 1లో చురుకుగా పనులు

రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడిన “రైల్వే స్టేషన్ల యొక్క ప్రధాన అప్‌గ్రేడేషన్” అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు దక్షిణ మధ్య రైల్వే లో అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది మరియు వీటికి సంబందించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2022 మేలో ప్రారంభించిన తిరుపతి రైల్వే స్టేషన్‌ అప్‌గ్రేడేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తయ్యేలా అన్ని స్థాయిలలో అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్ భవనం రాబోతుంది . జియోలాజికల్ సర్వే పూర్తి చేయడం, క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు, కాంక్రీట్ ల్యాబ్ & స్టోరేజీ షెడ్లు, రాబోయే స్టేషన్ బిల్డింగ్ కోసం పునాదుల పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. 100% బేస్మెంట్ ఫ్లోర్ కాస్టింగ్ పూర్తయింది, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు, దీనికి సంబంధించి ఫౌండేషన్‌లు, బేస్‌మెంట్ ఫ్లోర్‌లోని కాలమ్స్ మరియు ఎయిర్‌కాన్కోర్స్‌ వంటి పనులలో సుమారు 11,905 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఉపయోగించబడింది.

పురోగతిలో వున్నా పనులు పనుల వివరాలు : గ్రౌండ్ ఫ్లోర్ నుండి 2వ అంతస్తు వరకు పిల్లర్ల నిర్మాణం పనులు పురోగతిలో వున్నాయి . ప్లాట్‌ఫారమ్ 4, 5 మరియు 6లో ఎయిర్ కాన్కోర్స్ ఫౌండేషన్‌ల కాస్టింగ్ పనులు 90% పూర్తయ్యాయి . ప్లాట్‌ఫారమ్ 1లో ఇదే పని కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. రోజుకు 24 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం కోసం తవ్వకం పనులు పూర్తయ్యాయి మరియు దీని కోసం పునాదుల పనులు 30 శాతం పూర్తయ్యాయి . ఇప్పటివరకు, 2,300 మెట్రిక్ టన్నుల రీన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్‌ను పునాదులు, రిటైనింగ్ గోడలు, బేస్‌మెంట్ రూఫ్ స్లాబ్, భూగర్భ ట్యాంక్ మరియు ఎయిర్ కన్‌కోర్స్‌లలో ఉపయోగించారు.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, మాట్లాడుతూ స్టేషన్ అప్‌గ్రేడేషన్ కోసం జరుగుతున్న పనుల వేగం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు . ఈ పనుల నిర్మాణంలో మరింత అప్రమత్తంగా మరియు మరింత జాగ్రత్తగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం గా విరాజిల్లుతుందని , కాబట్టి ఇక్కడ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు అప్‌గ్రేడేషన్‌ పనులను పర్యవేక్షిస్తున్నామని, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు .

LEAVE A RESPONSE