Suryaa.co.in

Andhra Pradesh

పోలీసుల పక్షపాతంపై చర్యలు తీసుకోండి

డీజీపీకి లేఖ రాసిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధ చట్టాన్ని దిక్కరించి పక్షపాత దోరణితో పనిచేస్తోంది. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కుప్పం నియోజవకర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తున్నారు.వైసీపీ నేతల ఆదేశాలతో 34 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులతో రౌడీషీట్లు ఓపెన్ చేసేందుకు రంగం సిద్దం చేశారు.పోలీసులు వైసీపీ నాయకుల పట్ల ఒకలా టీడీపీ నాయకుల పట్ల మరోలా వ్యవహరిస్తున్నారు. పోలీసు, రెవిన్యూ అధికారులు కలిసి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై కృష్ణయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE