-గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధం
-ప్రతిపక్షానికి కుడా కాంగ్రెస్ పనికిరాకుండా పోయింది
-ప్రజల ఎజెండా తోటే దేశ రాజకీయాల్లోకీ
-సరిహద్దు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారు
-ఎత్తుగడలలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట
-ఏ రాష్ట్రంలో ఏ ఎత్తుగడ అవసరమో కేసీఆర్ కు తెలుసు
-సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయి
-అటువంటి ఎత్తుగడలతో టే తెలంగాణా రాష్ట్ర సాధన
-సరికొత్త ఎత్తుగడలతో దేశ రాజకీయాల్లోకి
-మంత్రి జగదీష్ రెడ్ది
ప్రధాని మోడీకి మూడిందని, వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సన్నద్ధమౌతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం తెలంగాణా భవన్ లో జరిగిన బి ఆర్ యస్ పార్టీ ప్లీనరీ అనంతరం తెలంగాణా భవన్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కుడా పనికి రాకుండా పోయిందని ఆయన ఎద్దేవాచేశారు.
ప్రజల ఎజెండాతోటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకీ అడుగిడుగుతున్నారన్నారు. ఎత్తుగడలలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని,ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వెయ్యలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన స్పష్టం చేశారు. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. అటువంటి ఎత్తుగడలతో తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోటే దేశ రాజకీయాల్లోకి అని ఆయన తెలిపారు.
మంత్రి జగదీష్ రెడ్డి వెంట శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,యన్.రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,యన్.భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.