– ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటు
– నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పాలమూరు బిడ్డ క్రిష్ణయ్య గారిని 1994లో అతి కిరాతకంగా చంపిన హంతకుడు ఆనంద్ మోహన్ హైదరాబాద్ వచ్చి క్రిష్ణయ్య కుటుంబ సభ్యులను కలవబోతున్నారని వస్తున్న వార్త కలిచివేస్తోంది. తెలంగాణ ప్రజల రక్తం మరుగుతోంది.
యావజ్జీవ శిక్షపడి జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటు. నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలి.
ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను చంపితే ఖండించిన బీఆర్ఎస్ నేతలు క్రిష్ణయ్య హంతకుల రాకపై ఎందుకు నోరు మెదపడం లేదు? క్రిష్ణయ్యను హత్య చేసిన వాళ్లను జైలు నుండి విడిపించడాన్ని కేసీఆర్ సమర్ధిస్తున్నట్లు అర్ధమవుతోంది. నితీశ్ – కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్ హైదరాబాద్ వస్తున్నారని భావిస్తున్నాం.
నితీశ్ కుమార్ – కేసీఆర్ మధ్యనున్న దోస్తీని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నా. క్రిష్ణయ్య ను చంపిన హంతకులను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.