Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కారంలో వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలి

– స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి దిశగా నిర్ధేశం
– మే నెల 9న ప్రారంభం కానున్న “జగనన్నకు చేబుదాం..” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్

కడప, ఏప్రిల్ 28 : ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుంటేనే.. ప్రభుత్వ పాలన కూడా సంతృప్త స్థాయిలో సాగుతుందని.. నాణ్యమైన సేవలను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసిలను ఆదేశించారు.శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా… మే నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత. ప్రాధాన్యతతో ప్రారంభించనున్న “జగనన్నకు చేబుదాం..”, స్పందన అర్జీలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా.. గృహనిర్మాణ పథకం అమలు తీరు, జగనన్న భూ హక్కు- భూ రక్ష పథకం, నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి, సచివాలయ సేవలు తదితర అంశాల్లో.. ఇప్పటి వరకు సాధించిన పురోగతి మొదలైన అంశాలపై.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమనికి కలెక్టరేట్లోని వీసీ హాలు నుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. జిల్లా ఎస్పీ అన్బు రాజన్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం.. విసి హాలులో హాజరయిన జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు. మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విధిగా లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. మే నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత. ప్రాధాన్యతతో ప్రారంభించనున్న “జగనన్నకు చేబుదాం..” కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా.. ఏకకాల సమయంలోనే… ప్రజల నుండి వినతిని స్వీకరించడం, అందుకు సంబంధించిన ఆమోదయోగ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించడం లేదా ఆమోదించి అమలు చేయడం జరుగుతుందన్నారు.

ఈ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో.. సీఎంవో స్థాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు గాను.. ప్రత్యేకంగా నియమించిన సీనియర్ లెవెల్ ఐఏఎస్ అధికారులు నెలకు రెండు పర్యాయాలు జిల్లాల్లో పర్యటించి ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు విధానం ద్వారా నాణ్యమైన, సంతృప్తికరమైన, పారదర్శకమైన.. పరిష్కారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా “స్పందన” గ్రీవిన్స్ కార్యక్రమం కంటే బెటర్ గా అర్జీల పరిష్కారం అందుతుందన్నారు. ఇందులో 1902 కాల్స్ స్వీకరణ, ఐవిఆర్ఎస్ ఎస్.ఎం.ఎస్. సందేశంతో.. మల్టిబుల్, ఫీడ్ బ్యాక్, అప్ డేట్ సమాచారం ఎప్పటికప్పుడు.. హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమ్ నుండి అందుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా.. ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా.. చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్, గ్రౌండింగ్ మొదలైన పెండింగ్ ప్రక్రియలను సంపూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. నిర్వహించే సచివాలయ, ఆర్బికేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు సేవలను మరింత విస్తృతం చేయాలని.. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో.. రైతుల పంటల నమోదు (ఈ-క్రాపింగ్)తో పాటు.. అన్ని రకాల పంటలకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు, మందులు, ఎరువులు కొరత లేకుండా సంసిద్దంగా ఉండేలా సంబందిత అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఆర్బికే పరిధిలో నాణ్యమైన స్టాకు ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు.

అంతే కాకుండా సీజనల్ వ్యాధుల కట్టడి చర్యలతో పాటు వేసవి వడగాల్పులు, వడదెబ్బ నుండి ప్రజలను కాపాడే ఆరోగ్య జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో దిశ పోలీస్ సర్వీసులను, దిశ యాప్ సేవలను విస్తృతం చేస్తూ…మహిళా సంక్షేమ అనుబంధ శాఖలు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విసి హాలు నుండి…పులివెందుల ఆర్డీవో వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE