– టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నది సామెత. జగన్ అండ్ కో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విలువైన భూములను హోల్ సేల్ గా కొట్టేస్తుంటే, కిందిస్థాయి వైసిపి నేతలు అధినేతను ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా కబ్జాలకు తెగబడుతున్నారు. ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగటిలోని పిఎసిఎస్ సొసైటీ స్థలం. ఇక్కడ ఒకప్పుడు సొసైటీ భవనం ఉండేది. సొసైటీని నందవరం తరలించడంతో వైసిపి నేతలు రాత్రికి రాత్రే ఆ బిల్డింగ్ ను కూల్చేశారు. స్థలాన్ని చదునుచేసి ఆక్రమించాలని ప్రయత్నించారు. స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు మేల్కొని, కంచేవేసి తాత్కాలికంగా స్థలాన్ని కాపాడగలిగారు. జలగన్న జమానాలో దొంగలచేతిలోకి తాళాలు వెళ్లాయి… ప్రభుత్వ ఆస్తులకు ఆ దేవుడే దిక్కు!