– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
నందిగామ టౌన్ : నందిగామ పట్టణం కాకాని నగర్ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కార్యాలయం నందు సోమవారం నాడు రాత్రి రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, మండల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నేతలు మరియు తెదేపా నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు తో కలిసి నియోజకవర్గ తెదేపా బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ..
బీసీల ఓట్లతో గద్దెనెక్కిన దొంగ జగన్ రెడ్డి మొదటి రోజు నుంచి బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాడు.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి, కార్పొరేషన్ నిధులను నవరత్నాల పేరిట దారి మళ్లించిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుంది.నాలుగేళ్లుగా బీసీలకు అన్యాయం రాష్ట్రంలోని బీసీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం, దగా చేస్తూనే ఉంది.
బీసీల కోసం ఉపయోగించాల్సిన రూ.75,760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుండి 24%కి కుదింపు దీని ద్వారా 16,800 మందికి పదవులకు దూరమైపోయారు.ఇళ్ల పట్టాల పేరుతో 8 వేల ఎకరాల బీసీ అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్నారు.
ఆదరణ పథకం రద్దు – లబ్దిదారుల 10 శాతం సొమ్ము స్వాహా – విదేశీ విద్య, పెళ్లి కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, బీసీ భవనాలు సహా 30 పథకాలు రద్దు.56 కార్పొరేషన్లకు రూపాయి ఖర్చు చేయలేదు.కనీసం కూర్చోడానికి కుర్చీలు లేవు, పదవీ కాలంలో ఒక్క రుణం ఇవ్వలేదు, ఒక్క ఫైలుపై సంతకం చేయలేని దుస్థితి.
బీసీ జనగణన చేయాలని,చట్ట సభల్లో బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్ కల్పించాలని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికగా బడ్జెట్ కేటాయించాలని గత ప్రభుత్వం తీర్మానం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ తీర్మానం విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకుండా మరోసారి తీర్మానం పేరుతో దగా చేసింది.
గతంలో బీసీ భవన్లు, కమ్యూనిటీ హాల్స్ – వేల కోట్ల సబ్ ప్లాన్– కార్పొరేషన్ల ద్వారా ఏటా రూ.3 వేల కోట్ల స్వయం ఉపాధి రుణాలు – ఐదేళ్లలో 4.20 లక్షల మందికి రుణాలు – రూ.964 కోట్లతో ఆదరణ పరికరాలు –జీవిత బీమా – బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య, పెళ్లి కానుకలు వంటి బీసీ ఉద్దారణ పథకాలు అమలయ్యేవి.
ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి 30 పథకాలు రద్దు చేసి బీసీల హక్కులను కాలరాసింది.ఒక్క ఛాన్స్ మాయతో బీసీలను అన్యాయం చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజానీకం ఓటు అనే ఆయుధంతో రానున్న ఎన్నికలలో శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి సాగనంపుదాం.