Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఈ సారి ఎండాకాలం కాస్తా వానాకాలంగా మారింది. గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి / గాలుల కోత ఇప్పుడు నైరుతి మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది..

ఉపరితల ఆవర్తనము దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు ఉంది. ఉపరితల ఆవర్తనము దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు అనుబంధ తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య ఉంది.

పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనము నుండి ఒక ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక అనుబంధ తమిళనాడు నుండి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతున్నది.ఆంధ్రప్రదేశ్ మరియు యానాం లలో దిగువ ట్రోపో ఆవరణము లో ఆగ్నేయ / దక్షిణ దిశలో గాలులు వీస్తున్నాయని వాతావవరణ శాఖ తెలిపింది.

LEAVE A RESPONSE