Suryaa.co.in

Andhra Pradesh

విద్య‌తో వికాసం..వైద్యంతో ఆరోగ్యం

అంద‌రికీ అందించిందే తెలుగుదేశం
– నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన త‌ల్లిదండ్రులు

తెలుగుదేశం ప్ర‌భుత్వం అందించిన విదేశీ విద్య అవ‌కాశాలు వేల‌కుటుంబాల్లో వెలుగులు నింపాయి. వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించిన సాయంతో వేలాది ప్రాణాలు నిలిచాయి. టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌యోజ‌నం పొందిన వారు, పాద‌యాత్ర‌గా త‌మ ప్రాంతానికి వ‌చ్చిన తెలుగుదేశం తేజం యువ‌నేత నారా లోకేష్‌ని క‌లిసి టిడిపి చేసిన మేలు మ‌ర‌వ‌లేమ‌ని చెబుతున్నారు.

విదేశీ విద్య ప‌థ‌కం కింద సాయం అందుకుని జ‌ర్మ‌నీలో చ‌దువుకున్న త‌న‌యుడు అక్క‌డే ఉన్నతోద్యోగంలో సెటిల‌య్యాడ‌ని, మా కుటుంబం సంతోషంగా ఉండ‌టానికి తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని బాల‌గంగాధ‌ర్ తిల‌క్ పేర్కొన్నారు. లోకేష్‌కి స్వీట్లు అంద‌జేసి థ్యాంక్స్ చెప్పారు. పాప‌కి వైద్య‌చికిత్స‌ల కోసం సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేసిన చంద్ర‌బాబు త‌న కంటిదీపాన్ని కాపాడార‌ని ఓ త‌ల్లి లోకేష్‌ని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

LEAVE A RESPONSE