• కర్నూలు జమ్మిచెట్టు బజారులో యువనేత లోకేష్ ఓ టీస్టాల్ వద్ద టీతాగి, నిర్వాహకుడితో కొద్దిసేపు ముచ్చటించారు. వ్యాపారం ఎలాఉందని యువనేత వాకబు చేశారు.
• టీస్టాల్ నిర్వాహకుడు అబ్దుల్లా మాట్లాడుతూ… కరెంటు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి.
• కరోనా తర్వాత వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంది.
• పన్నులు, పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు పెరగడంతో భారంగా జీవితాన్ని లాగాల్సి వస్తోంది.
• ధరలు తగ్గిస్తే మాలాంటి వారికి వెసలుబాటుగా ఉంటుంది.
యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సామాన్యుడు బతకడమే కష్టంగా మారింది.
• గత నాలుగేళ్లలో ఒక్కో కుటుంబంపై రూ.2.5లక్షల భారం మోపారు.
• 10రూపాయల ఇచ్చి వందలాగేస్తూ ప్రజలను జలగలా పీడిస్తున్నారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోలు, డీజిల్, నిత్యవసరాల ధరలను తగ్గిస్తాం.
• రాష్ట్రంలో అడ్డగోలుగా పెంచిన పన్నుల విధానాన్ని సమీక్షించి ప్రజలపై భారాన్ని తగ్గిస్తాం.