– జీవోనెం-1ని హైకోర్ట్ కొట్టివేయడం రాష్ట్రప్రజల విజయం
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన జీవోనెం-1ని హైకోర్ట్ కొట్టివేయడం రాష్ట్రప్రజల విజయమని, దేశపౌరులు తమఆవేదన, బాధని నిరసనరూపంలో తెలియచేసే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడేహక్కుల్ని రాజ్యాంగంకల్పిస్తే, వాటిని తన అధికారమదంతో తుంచేయాలని చూసిన ముఖ్యమంత్రికి న్యాయస్థానం సరైన విధంగా బుద్ధిచెప్పిందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“జీవోనెం-1 ద్వారా జగన్ రాజ్యాంగవిచ్ఛిన్నానికి పాల్పడుతూ, ప్రజలు, ప్రతిపక్షాల గొంతునొక్కాలనిచూస్తే నారా లోకేశ్ అదే రాజ్యాంగాన్ని చేతబూని ప్రజలస్వేఛ్చను, ప్రశ్నించేతత్వాన్ని, రాజ్యాంగశక్తి గొప్పతనాన్ని ప్రతిఒక్కరికీ తెలియచేసేలా యువగళం పాదయాత్రలో తనపాదం కలిపాడు. జగన్ ఎంతగా తనను అడ్డుకోవాలనిచూస్తే అంతకు పదింతల పట్టుదల, ఉత్సాహంతో ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రను కొనసాగిస్తున్నాడు.
తన హామీలు, అసమర్థపాలనను ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదన్న దురుద్దేశంతో, వారి గొంతులు నొక్కేందుకే జగన్ జీవో-1 తీసుకొచ్చాడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు లెక్కలేనన్ని హామీలిచ్చాడు. అధికా రంలోకి వచ్చి ఇన్నేళ్లైనా వాటిని నెరవేర్చలేని తనఅసమర్థతను, చేతగానితనాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో వారి గొంతులునొక్కడానికే జీవో-1 తీసుకొచ్చా డు. జగన్ తప్పుల్ని, అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తూ, అతని హామీలను గుర్తుచేస్తున్న వారిని అణగదొగ్గటానికే చీకటిజీవో -1 తీసుకొచ్చాడు. ప్రత్యేకహోదా తెస్తాను, అమరావతి నిర్మిస్తాను..పోలవరం పూర్తిచేస్తాను, వెనుకబడిన జిల్లాల్ని అభివృద్ధిచేస్తాను, రైల్వేజోన్ సాధి స్తాను, సీపీఎస్ రద్దుచేస్తాను, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదలచేస్తాను, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధికల్పిస్తాను, మహిళలసంతోషం కోసం మద్యాన్ని నిషేధిస్తాను, 45ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇస్తాను అన్న జగన్, వాటిలో ఒక్కదాన్నికూడా 4ఏళ్లపాలన లో నెరవేర్చిందిలేదు. అమరావతిని ఇక్కడేఉంచుతాను అన్నావు…మరి మూడుముక్కలాట ఎందుకు ఆడుతు న్నావు అని ప్రశ్నించిన అమరావతిరైతులు, మహిళలు, ప్రజలపై ఉక్కుపాదం మోపాడు. దళితులపై అట్రాసిటీకేసులు పెట్టించి, అకారణంగా వారిని జైళ్లకుపంపాడు.
జగన్ దుర్మార్గపాలనపై గళమెత్తిన తెలుగుదేశాన్ని, ఆ పార్టీనేతలు, కార్యకర్తల్ని జీవో-1 ముసుగులో తప్పుడు కేసులతో జైళ్లకు పంపించాడు
ప్రత్యేకహోదా ఏదీ..పరిశ్రమలు ఏవీ అనిప్రశ్నించిన యువతపై, అమరావతి, పోలవరం నిర్మాణంపై తనను నిలదీసినవారిపై ముఖ్యమంత్రి తప్పుడుకేసులుపెట్టించి, అక్రమ అరెస్టు లు చేయించాడు. వైసీపీనేతల అవినీతి, అరాచకాల్ని ఎదిరించినవారిపై దాష్టీకానికి పాల్పడ్డా డు. అధికారంలోకి వస్తే ప్రజారంజక పాలన అందిస్తానుఅన్న జగన్, ముఖ్యమంత్రి హోదాలో ప్రజావేదికను నేలమట్టంచేసి, తనవిధ్వంసపాలనకు శ్రీకారంచుట్టాడు. జగన్ దుర్మార్గపు పా లనపై గళమెత్తిన తెలుగుదేశంనేతలు, కార్యకర్తల్ని దారుణంగా హతమార్చేందుకు జగన్ తన అధికారాన్నిఉపయోగించాడు. టీడీపీరాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు మొదలు ప్రధా న నాయకులందరినీ తప్పుడుకేసులతో జైళ్లకుపంపించాడు. సైకిల్ పార్టీ కార్యకర్తల గొంతు నులి మేందుకు కర్కశంగా వ్యవహరించాడు. అంతటితో ఆగకుండా తనఫ్యాక్షన్ పాలనను ఎవరూ ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో అర్థరాత్రి చీకటిజీవో -1 తీసుకొచ్చాడు.
చంద్రబాబుని ప్రజలకు దూరంచేయాలన్న కుటిలబుద్ధితోనే జగన్ జీవో-1 తెచ్చాడు
జగన్ దుర్మార్గాలు, అక్రమాలని ప్రశ్నించేందుకు టీడీపీఅధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టగానే వైసీపీమూకల్ని ఆయనసభలు,సమావేశాల్లోకి చొప్పించి, వారిలో కొంత మందిని తానే బలితీసుకొని కుట్రరాజకీయంచేశాడు. గుంటూరు, కందుకూరు ఘటనల్లో చంద్రబాబువల్లే అమాయకప్రజలు చనిపోయారని చెప్పి, ఆయన్ని ప్రజలకు దూరంచేయాల న్న దుర్భుద్ధితో జీవో-1 తీసుకొచ్చాడు. చీకటిజీవోతో చంద్రబాబుకు లభిస్తున్న జనాదరణ తగ్గించాలని శతవిధాలా ప్రయత్నించాడు. దుర్భుద్ధి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని, కుటిల త్వాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు నిర్భయంగా, నిర్ద్వందంగా తిరస్కరించారు. అయినా సైకో ముఖ్యమంత్రి తననిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేదు.
జీవో-1ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో దాని ఆధారంగా ప్రజలు,ప్రతిపక్షాలపై పెట్టిన తప్పుడుకేసుల్ని ప్రభుత్వం తక్షణమే ఎత్తేయాలి
ప్రజలు స్వతంత్రంగా మాట్లాడుకుంటూ, దేశంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నార ని, ప్రభుత్వాలుఅయినా, నాయకులైనా రాజ్యాంగానికి బద్ధులేనని, జీవోనెం-1 తీసుకురావ డం ముమ్మాటికీ రాజ్యాంగవిరుద్ధమేనని రాష్ట్రహైకోర్ట్ తేల్చిచెప్పింది. న్యాయస్థానం తీర్పు జగన్ కు అతని దుర్మార్గపు ప్రభుత్వానికి చెంపపెట్టేనని చెప్పాలి. జీవోనెం-1ను కేవలం ప్రతిపక్షాలకు, ప్రజలకు మాత్రమే వర్తింపచేసిన జగన్, తానుమాత్రం యథేచ్ఛగా నియమ, నిబంధనలు ఉల్లంఘించి, తనసభలు, సమావేశాలు నిర్వహించుకున్నాడు. హైకోర్ట్ జీవో-1 ని కొట్టేసిన నేపథ్యంలో, సదరుజీవోను అడ్డంపెట్టి ప్రజలు, ప్రతిపక్షనేతలపై పెట్టిన తప్పుడు కేసుల్ని తక్షణమే ఎత్తేయాలని తెలుగుదేశంపార్టీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. జీవో -1 ని అడ్డుపెట్టుకొని ప్రజల్ని నానారకాలుగా హింసించిన జగన్ వారందరికీ బేషరతుగా బహి రంగ క్షమాపణలు చెప్పాలని కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది.
జీవో-1తో జగన్ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే, లోకేశ్ అదే రాజ్యాంగాన్ని చేతబూని దానిగొప్పతనం, శక్తిని యువగళంయాత్రలో ప్రతిఒక్కరికీ చాటిచెప్పాడు
భారతదేశ ప్రజలందరికీ అంబేద్కర్ మహానుభావుడుఇచ్చిన రాజ్యాంగం స్వేచ్ఛా, స్వాతం త్ర్యం, సమానత్వాలు ఇచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని తుంగలోతొక్కుతూ, జగన్ కక్షతో, కుట్రతో లోకేశ్ యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీచేశా డు . రోడ్డుపై నడవటానికి వీల్లేదని, మైక్ లో మాట్లాడకూడదని, ఆఖరికి స్టూల్ పై కూడా నిలబడకూడదంటూ జగన్ దారుణంగా వ్యవహరించాడు.
రాజ్యాంగవిచ్ఛిన్నకారి, నియంత్ర త్వ పోకడలు కలిగిన జగన్ బ్రిటీష్ వారికంటే దారుణంగా ప్రవర్తించాడు. కానీ లోకేశ్ ఎక్కడా తొణక్కుండా, బెణక్కుండా రాజ్యాంగాన్నిచేతబూని తనపాదయాత్రను కొనసాగించాడు. రాజ్యాంగం గొప్పతనం, శక్తిని ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలాచేసి, బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన వారసుడిగా నిలిచాడు. జగన్ దుశ్చర్యలు, దుర్మార్గాల్లో భాగంగా చీకటిజీవోను అమలుచేసిన పోలీసులుకూడా నేడుసిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు పోలీస్ అధికారులైతే ఇప్పటికే కోర్టుబోనులో నిలబడి, న్యాయస్థానాలకు వివరణఇచ్చుకు న్నారు. ఇంతజరిగినా ఇంకాకొందరు పోలీస్ అధికారులు చట్టాలకు అతీతంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. భవిష్యత్ లో జగన్ జైలుకెళ్లినా ఆయనకు ఆ ప్రదేశం కొత్తకాదు.
తనడబ్బుతో ఆయనఅక్కడకూడా సకలభోగా లు అనుభవిస్తాడు. కానీ ఆయనచెప్పింది విని తప్పులుచేసే అధికారులు మాత్రం కోలుకోలే నివిధంగా దెబ్బతింటారు. న్యాయస్థానాలు చెప్పినా, ప్రజలుఛీకొట్టినా జగన్ వైఖరిమాత్రం మారడంలేదు. ఇప్పటికీ దున్నపోతుపై వానకురిసినవిధంగానే వ్యవహరిస్తున్నాడు. తన అధికారమదంతో కోర్టుధిక్కరణకు పాల్పడుతున్న జగన్ పై న్యాయస్థానాలు కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జీవోనెం-1 రాకముందు, వచ్చాకకూడా చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చే అశేషజనవాహినిలో మార్పులేదనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలి.” అని మాణిక్యరావు హితవుపలికారు.