Suryaa.co.in

Andhra Pradesh

అంతిమంగా గెలిచేది అంబేద్కర్ రాజ్యాంగమే..జగన్ నియంతృత్వం కాదు

– G.O. no:- 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

దేశంలో అంతిమంగా గెలిచేది… నిలిచేది అత్యున్నతమైన అంబేద్కర్ రాజ్యాంగమే. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి…భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారు.ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని….అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైంది. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీ.ఓ. నెంబర్ 1 ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం.

LEAVE A RESPONSE