-తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా రూ. 43 వేల కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగన్
– వివేకా హత్య కేసులో భాగస్వాములైన భాస్కర్ రెడ్డి లోపల ఉంటే ఆయన కొడుకు ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం బయట ఎలా తిరుగుతున్నారు?
-ఏ చీకటి ఒప్పందంలో భాగంగా బయట తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి
– పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ రెడ్డి కొత్త డ్రామా
– వాస్తవాలను తొక్కిపెట్టి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి అటాచ్ మెంట్ ఆర్డర్ ఇవ్వటం దుర్మార్గం
– టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
వైసీపీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెరతీశారని, వాస్తవాలను తొక్కిపెట్టి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి అటాచ్ మెంట్ ఆర్డర్ ఇవ్వటం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేవలం రాజకీయకక్ష్యతోనే చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి అటాచ్ మెంట్ ఆర్దరిచ్చారు. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.
లింగమనేని రమేష్ రాష్ట్ర విభజనకు ముందే గుంటూరు పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారు. విభజనకు ముందు దశాబ్దాల కాలం నాడు మైటాస్ కంపెనీ, ఏసీసీ సిమెంట్స్ కంపెనీ గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశాయి. ఆ కంపెనీల నుంచి 2011లో లింగమనేని రమేష్ భూములు కొన్నారు తప్ప చంద్రబాబు నాయడు సీఎం అయ్యాక కొనలేదు.
కేవలం రాజకీయ కక్ష్యతో టీడీపీ నేతలకు ఆపాదిస్తూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది. లేని సర్వేలు నెంబర్లు చూపించటం అధికారుల దిగజారుడుతనం. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై అక్రమ కేసులు పెట్టి జగన్ సాధించిందేంటి? జగన్ అంటేనే విద్వంసం. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని విధ్వంసం చేసి కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు, కానీ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు చెప్పింది. అసైండ్ భూములు కొన్నారని తప్పుడు కేసులు పెట్టారు.
అసైండ్ భూములు యజమానులు ఆ కేసులకు మాకు సంబందం లేదని, మేం ఎవరికి ఫిర్యాదు చేయలేదని బహిరంగంగా చెప్పారు. నాలుగేళ్ల నుంచి అమరావతిపై అక్రమ కేసులు పెట్టిన జగన్ రెడ్డి సాధించిందేంటి? నాలుగేళ్ల నుంచి సీఐడీ విచారణ చేసి కనీసం చార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. లేని, రాని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుపై కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేసులు పెట్టారని కోర్టు సైతం చెప్పింది.
అయినా సీఐడీ అధికారులు తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారు. క్విడ్ ప్రోకో అనేది జగన్ రెడ్డికి బాగాతెలుసు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా రూ. 43 వేల కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగన్ . వివేకా హత్య కేసులో భాగస్వాములైన భాస్కర్ రెడ్డి లోపల ఉంటే ఆయన కొడుకు ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం బయట ఎలా తిరుగుతున్నారు? ఏ చీకటి ఒప్పందంలో భాగంగా బయట తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి అటాచ్ మెంట్ పేరుతో డ్రామాలాడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు.