Suryaa.co.in

Andhra Pradesh National Telangana

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లకు ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ” అవుట్‌లెట్‌లు

– ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, 35 రైల్వే స్టేషన్లు ‘ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ 37 అవుట్‌లెట్‌లతో ఏర్పాటు

సమాజంలోని అట్టడుగు వర్గాలకు మార్కెట్‌ను అందించడం మరియు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడం ద్వారా స్థానిక/స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2022-23 యూనియన్ బడ్జెట్‌లో ప్రకటించిన నాటి నుండి ఈ కాన్సెప్ట్ ఊపందుకొని. స్థానిక చేతివృత్తులకు విజయంగా నిరూపించబడింది.

దక్షిణ మధ్య రైల్వేలో, ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కాన్సెప్ట్‌ను మొదట ఆరు రైల్వే స్టేషన్లలో 30 రోజులకు గాను ప్రవేశపెట్టారు . చివరికి, అద్భుతమైన స్పందన లభించడంతో, పైలెట్ ప్రాజెక్ట్ కింద జోన్‌లోని డెబ్బై రైల్వే స్టేషన్‌లలో అవుట్‌లెట్‌లు విస్తరించాయి. ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వే అంతటా ఉన్న 72 రైల్వే స్టేషన్‌లు , 4 రాష్ట్రాలలో అంటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో స్థానిక ఉత్పత్తులకు అధిక ఆదరణ అందించే ‘వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్’ యొక్క 77 అవుట్‌లెట్‌లతో కవర్ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ మొదలైన వాటితో సహా ముప్పై-ఐదు రైల్వే స్టేషన్‌లు, ఒక స్టేషన్‌లో ఒక ఉత్పత్తి యొక్క 37 స్టాల్స్‌తో కవర్ చేసాయడం జరిగింది . తద్వారా స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి మరియు సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ కలంకారి చీరలు వంటి స్థానిక నేత కార్మికుల చేనేతలు ఉన్నాయి; జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన్ ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, పాపడాలు వంటి స్థానిక వంటకాలు; షెల్ పెయింటింగ్స్ మరియు రైస్ ఆర్ట్ మొదలైనవి.

ఆంధ్రప్రదేశ్లో చేతితో పెయింట్ చేయబడిన పత్తి వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది, దీనిని ‘కలంకారి’ అని పిలుస్తారు. కలంకరి కళలో రెండు విలక్షణమైన శైలులు ఉన్నాయి, అవి శ్రీకాళహస్తి శైలి మరియు మచిలీపట్నం శైలి. ఈ కలంకారి ముద్రణల ఇతివృత్తం చాలా వరకు పౌరాణికమైనది మరియు ప్రక్రియలో పదిహేను దశలు ఉంటాయి. కలంకారి చీరలు మరియు చేనేత వస్త్రాల కోసం ఎనిమిది అవుట్‌లెట్‌లు అంకితం చేయబడ్డాయి.

ఇది స్థానిక నేత కార్మికులు చిల్లర వ్యాపారుల ఇబ్బందికి బదులు ప్రజలకు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ అవుట్‌లెట్‌లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి రైల్వే స్టేషన్‌లకు వచ్చే ప్రయాణీకులలో కలంకారి కళను మరింత ప్రాచుర్యం పొందేందుకు సహాయపడతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుసంపన్నమైన మరియు విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది, ఇది వివిధ హస్తకళల పరిణామానికి బీజం వేసింది . చెక్కతో చెక్కడం అనేది రాష్ట్రంలోని పురాతన సాంప్రదాయ చేతిపనులలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ చెక్క పనిలో గృహోపకరణాల నుండి బొమ్మలు మరియు ఇతర బొమ్మల వరకు వివిధ వస్తువులు ఉన్నాయి. వుడెన్ కట్లరీ మరియు ఎటిపొక్క లక్కర్‌వేర్ బొమ్మలతో సహా స్థానిక కళాకారులచే చెక్క హస్తకళల అమ్మకం కోసం ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ యొక్క ఆరు అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.

‘వన్ స్టేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌’ పథకం స్థానిక కళాకారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం కల్పిస్తుందని జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ప్రయాణీకులకు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైల్వే స్టేషన్లు సరిపడా స్థలమని ఆయన అన్నారు.

స్థానిక కళాకారులచే విజయ గాధలు :
వెలగపూడి ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన కృష్ణ కుమారికి గుంటూరు రైల్వే స్టేషన్‌లో పర్యావరణ అనుకూలమైన జూట్ బ్యాగులను విక్రయించినందుకు గాను ఓఎస్‌ఓపీ అవుట్‌లెట్ లభించింది. తన అనుభవాన్ని పంచుకుంటూ కుమారి మాట్లాడుతూ, “ఇంతకుముందు, మేము సరైన మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ కోసం కష్టపడ్డాము, అయితే, మా ఓ ఎస్ ఓ పి స్టాల్‌ను వచ్చిన తర్వాత, వెలగపూడి ఎంటర్‌ప్రైజెస్ రోజువారీ అమ్మకం రూ. 5000/- మరియు పండుగ సీజన్లో సుమారు రూ. 7000/- వరకు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. మేము మహిళలు మరియు అణగారిన వర్గాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము, ఇది మాకు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఒక మార్గంగా ఉంటుందని ఆమె చెప్పారు.

గుడివాడకు చెందిన నేత కార్మికురాలు కలంకారి చీరల విక్రయం కోసం గుడివాడ రైల్వే స్టేషన్‌లో ఓ ఎస్ ఓ పి అవుట్‌లెట్‌ను కేటాయించిన సి. కనకరత్నం మాట్లాడుతూ, “కలంకారి చీరల నేయడం వెనుక ఉన్న కృషి గుర్తించబడదు, ఎందుకంటే ఇది హోల్‌సేల్ కొనుగోలుదారులు మరియు రిటైలర్ల నుండి కనీస ఆదాయాన్ని పొందుతుంది. మేము మా ఉత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించగలుగుతున్నందున ఇది ఇప్పుడు మారిపోయింది, ఇది మాకు మంచి కస్టమర్ మార్కెట్‌ను మాత్రమే కాకుండా మా స్థానిక ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించే విశ్వాసం మరియు సంతృప్తిని కూడా ఇస్తుంది.

LEAVE A RESPONSE