Suryaa.co.in

Andhra Pradesh

కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసి తీరుతాం

-జగన్మోహన్ రెడ్డి మాదిరి సుప్రీం కోర్టులో ఒకమాట, బయట మరొకమాట చెప్పం
యువనేత లోకేష్
-లోకేష్ ను కలిసిన ఆళ్లగడ్డ న్యాయవాదులు

• ఆళ్లగడ్డలో శివారు క్యాంప్ సైట్ లో న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేయాలి.
• ఆళ్లగడ్డలో 5వ అడిషనల్ జిల్లాజడ్జి కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
• ఆళ్లగడ్డలో ఉన్న జడ్జిల నివాస భవనాలకు నిధులు మంజూరు చేయాలి.
• ఆళ్లగడ్డ కోర్టు ఆవరణలో కక్షిదారులకు టాయ్ లెట్లు నిర్మాణం చేపట్టాలి.
• ఆళ్లగడ్డలో బార్ అసోసియేషన్ భవననిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
• ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి.
• జూనియర్ న్యాయవాదుల వృత్తినైపుణ్యతకు శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయం ఏర్పాటుచేయాలి.
• జూనియర్ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడేవరకు ఆర్థికసాయం అందించాలి.
• న్యాయవాదులపై దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించాలి.
• న్యాయవాదుల సంక్షేమనిధి అర్హతల్లో 35సంవత్సరాల వయసు నిబంధనను సడలించి, న్యాయవాదులందరికీ ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి.
• న్యాయవాదుల ఆరోగ్యభద్రతకు పరిమితిలేని హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
తెలుగుదేశం పార్టీకి న్యాయవాదులు, న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవమర్యాదలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరి సుప్రీం కోర్టులో ఒకమాట, బయట మరొకమాట చెప్పం. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేసి తీరుతాం.

తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై ప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్నవారే సోషల్ మీడియాలో విషంచిమ్మడం దారుణం. రాష్ట్ర హైకోర్టులో కనీసం కప్పు కాఫీ దొరకడం లేదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి ఈ వ్యవస్థపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. న్యాయమూర్తులు, న్యాయవాదులపై అమర్యాదగా ప్రవర్తించిన వారిపై ఉక్కుపాదం మోపుతాం.
టిడిపి అధికారంలోకి రావగానే అద్దెభవనాల్లో నడుస్తున్న కోర్టులన్నింటికీ సొంతభవనాల నిర్మాణం చేపడతాం.ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన న్యాయవాదులకు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తాం. జూనియర్ న్యాయవాదులకు నైపుణ్య శిక్షణాకేంద్రాలు, గ్రంథాలయాలు ఏర్పాటుచేస్తాం.

LEAVE A RESPONSE