తాడేపల్లి దాటి బయటకురాని ముఖ్యమంత్రి ఉంటే.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయి?
– చంద్రబాబు హయాంలో విదేశీపెట్టుబడుల ఆకర్షణలో దేశంలో 5వస్థానంలో ఉన్న ఏపీ, జగన్ రెడ్డి అవినీతి, అహంకారం, కమీషన్ల దెబ్బకు 14వస్థానానికి పడిపోయింది.
• జగన్ రెడ్డి అహంకారంతో ఏపీఈడీబీ, పీపీఏలు రద్దుచేయడంతో పారిశ్రామికవేత్తలు ఏపీవైపుచూడటమే మానేశారు.
• జగన్ 4ఏళ్లలో ఏపీకి తీసుకొచ్చిన విదేశీపెట్టుబడులన్నీ కలిపినా టీడీపీప్రభుత్వంలో ఒకసంవత్సరంలో వచ్చిన పెట్టుబడులకు సరితూగవు.
• తాడేపల్లి దాటి బయటకురాని ముఖ్యమంత్రిని చూసి, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
• పెట్టుబడుల సదస్సుకి దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడవిహారాలు చేసిన తిరిగొస్తే రాష్ట్రానికి పెట్టుబడులుఎలా వస్తాయి?
• ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇప్పటికీ రాష్ట్రం ముందుండటానికి చంద్రబాబు తీసుకున్న పారిశ్రామిక నిర్ణయాలే కారణం. • ప్రజలు ఓటుతో జగన్ రెడ్డిని ఎంతత్వరగా సాగనంపితే, రాష్ట్రానికి అంతత్వరగా మంచిరోజులు వస్తాయి.
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ (విదేశీపెట్టుబడులు) లో ఏపీస్థానం దిగజారిపోవడం బాధాకరమని, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు 2019 నుంచి 2022డిసెంబర్ వరకు విడుదలచేసిన నివేదిక ప్రకారం భారతదేశంలోకి వచ్చిన విదేశీపెట్టుబడుల జాబితాలో ఏపీ 14వస్థానంలో నిలిచిందని, చంద్రబాబు 5ఏళ్లపాలనలో దేశంలో మొదటి 5స్థానాల్లో నిలిచిన రాష్ట్రం నేడు అట్టడుగుకి పడిపోయిందని, టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
రాష్ట్రానికి విదేశీపెట్టుబడులు రాకపోవడం ముమ్మాటికీ జగన్ రెడ్డి వైఫల్యమే
“విదేశీపెట్టుబడుల ఆకర్షణలో మనరాష్ట్రంకంటే 13రాష్ట్రాలు దేశంలో ముందంజ లో ఉన్నాయి. వైసీపీప్రభుత్వంవచ్చాక, 4ఏళ్లలో ఏపీకివచ్చిన విదేశీ పెట్టు బడు లు కేవలం రూ.5,751కోట్లుమాత్రమే. సంవత్సరానికి రూ.15వేలకోట్లు కూడా రాలేదు. ఎందుకు మనరాష్ట్రంవైపు పారిశ్రామికవేత్తలు, కంపెనీలు కన్నెత్తిచూడ టం లేదో అందరూఆలోచించాలి. దేశీయపారిశ్రామికవేత్తలతోపాటు, విదేశీ పారిశ్రా మికవేత్తలు ఏపీవైపుచూడకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి పనితీరే. పారిశ్రామికవేత్తలు భయపడటమే ఏపీకి ఈ దుస్థితిపట్టడానికి కారణం. గతంలో చంద్రబాబుగారి పాలనలో వరదలావచ్చిన విదేశీపెట్టుబడులు నేడు మచ్చుకు కూడా రాకపోవడం నిజంగా జగన్ రెడ్డి వైఫల్యమే.
పెట్టుబడులసదస్సుకోసం దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలతో మాట్లాడకుండా, విహారయాత్రలుచేసి తిరిగొచ్చేస్తే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి?
కోవిడ్ ను బూచిగాచూపి తప్పించుకోవడం ఈ ప్రభుత్వానికి బాగా అలవాటైంది. కోవిడ్ సమయంలో ఒక్కసంవత్సరం మాత్రమే దేశవ్యాప్తంగా విదేశీపెట్టుబడుల రాకలో మందగమనం ఏర్పడింది. మరుసటి సంవత్సరంనుంచి ఇతరరాష్ట్రాలకు బాగానే వచ్చాయి. దేశంలో ఎఫ్.డీ.ఐల ఆకర్షణలో మహారాష్ట్ర ముందంజలో ఉం ది. రూ.3కోట్ల74లక్షల విదేశీపెట్టుబడులు ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచింది. కర్ణా టక రూ.3కోట్ల21లక్షలు, గుజరాత్ కు రూ.2కోట్ల34లక్షలు, ఢిల్లీకి రూ.లక్షా78వే ల కోట్ట విదేశీపెట్టుబడులు వచ్చాయి. మనసోదరరాష్ట్రమైన తెలంగాణకు రూ.35 వేలకోట్ల విదేశీపెట్టుబడులువచ్చాయి. తెలంగాణమాత్రం కూడా విదేశీపెట్టుబడు లు తీసుకురావడంలో ఏపీ ఎందుకువిఫలమైంది? 4ఏళ్లలో రూ.6వేలకోట్ల ఎఫ్.డీ. ఐలు కూడా ఎందుకు ఆకర్షించలేకపోయింది. విదేశీపెట్టుబడులకోసం ఏపీప్రభు త్వమే పోరాడాలి. ఎవరూ పనిగట్టుకొని పెట్టుబడులుపెట్టడానికి ముందుకురారు.
దావోస్ లో ప్రతిఏటా జరిగే విదేశీపెట్టుబడులసదస్సు ఎఫ్.డీ.ఐల ఆకర్షణకు కేంద్ర బిందువు. ఆ సదస్సు రెండుసార్లు జరిగితే ఏపీప్రభుత్వం ఒకసారి వెళ్లలేదు. ఒక సంవత్సరం జరిగిన సదస్సుకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి, తూతూమంత్రంగా గడిపి, విహారాలుచేసి తిరిగొచ్చేశారు. మూడురోజుల సదస్సుకి హాజరైన సీఎం రాష్ట్రానికి ఏంపెట్టుబడులు తీసుకొచ్చారంటే, అదానీ, అరబిందో వంటి సంస్థలతో ఒప్పందా లుచేసుకున్నారు. ఒక్క విదేశీకంపెనీతో ఒప్పందంజరిగిందిలేదు. ఇలాంటి ఉత్తు త్తి ఒప్పందాలతో ముఖ్యమంత్రి ప్రజల్ని ఎన్నాళ్లుమోసగిస్తారు?
జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏపీఈడీబీని రద్దుచేయడం, పీపీఏలు రద్దు చేయడం చేశాడు
రాష్ట్రానికి విదేశీపెట్టుబడులు రాకపోవడానికి ప్రధానకారణం వైసీపీప్రభుత్వ అహం కారపూరిత చర్యలే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చీరాగానే టీడీపీప్రభుత్వం విదేశీపెట్టుబడుల ఆకర్షణకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీ.ఈడీబీ) సీఈవోగాఉన్న జాస్తి కృష్ణకిశోర్ పై తప్పుడుకే సులు పెట్టారు. ఆయనపై పెట్టినకేసులన్నీ తప్పుడువని నిర్ధారించిన న్యాయస్థా నం వాటిని కొట్టేసింది. ఈ ప్రభుత్వచర్యతో ఆయన ఇక్కడుండలేక కేంద్రసర్వీసుల కు వెళ్లిపోయారు. దాంతో ఏపీ.ఈడీబీ మూతపడింది. టీడీపీప్రభుత్వం చేసుకున్న పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రి మెంట్లు) రద్దుచేయడం మరోకారణం. గతంలో ఏపీ ప్ర భుత్వంతో ఒప్పందంచేసుకున్న కంపెనీలు కోర్టుని ఆశ్రయించాయి.
జపాన్ కు చెందిన కొన్నికంపెనీలు ఏకంగా ఏపీముఖ్యమంత్రిపై ప్రధానమంత్రికే ఫిర్యాదు చేశాయి. పీపీఏలు రద్దుచేయడం తప్పని సుప్రీంకోర్టు కంపెనీలకు అనుకూలంగా తీ ర్పుఇచ్చింది. ఇదంతా ఏపీప్రభుత్వంపై పారిశ్రామికవర్గాల్లో దురభిప్రాయం కలుగ చేసింది. గతంలో పీపీఏలను రద్దుచేసిన జగన్ రెడ్డి, మరలా అవేకంపెనీలతో పీపీఏలుచేసుకొని, తనకురావాల్సిన కమీషన్లు తీసుకొని ఏమీతెలియనట్టు కూ ర్చున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ ఇప్పుడుతొలిస్థానంలో నిలవడానికి కారణంకూడా గతంలో చంద్రబాబుగారుచేసిన కృషిఫలితమే. 2014, 2015, 20 16, 2017, 2018లో ఐదేళ్లపాటు టీడీపీప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలవల్లే జగన్ వచ్చాక కూడా ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ముందు నిలిచింది.
పీపీఏల రద్దుతోపాటు, అప్పటికే ఒప్పందాలుచేసుకొని ఏపీలో కార్యకలాపాలు ప్రా రంభించిన లులూ లాంటి విదేశీకంపెనీల్ని కూడా జగన్ తరిమేశాడు. అదే కంపెనీ నేడు ఉత్తరప్రదేశ్ లో మంచిబిజినెస్ ప్రారంభించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ను కూడా అలానే తరిమేశారు. జాతీయస్థాయికంపెనీలైన అదానీ సంస్థ డేటాసెంటర్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ వంటివికూడా రాష్ట్రానికి గుడ్ బై చెప్పాయి.
జగన్మోహన్ రె డ్డికి ఏపీకి పెట్టుబడులు రావడంఇష్టంలేదు. 4ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయ నఒక్కసారి కూడా పెట్టుబడులకోసం ఏ దేశానికి వెళ్లిందిలేదు. విదేశీకంపెనీలతో సంప్రదింపులుజరిపిందిలేదు. సార్ తాడేపల్లి దాటిబయటకు రాకపోతే, విదేశీపె ట్టుబడులు ఏపీకి ఎలావస్తాయి. ఉన్నకంపెనీలను బెదిరిస్తే ఇక కొత్తగా ఎవరైనా ఏపీకి వస్తారా? కియాపరిశ్రమ ఎండీని వైసీపీఎంపీ వేలుచూపించి బెదిరించాడు. దాంతో ఆసంస్థ ఏపీలో పెట్టాలనుకున్న అనుబంధపరిశ్రమలను ఇతరరాష్ట్రాలకు తరలించింది. 4ఏళ్లలో రాష్ట్రానికి 6వేలకోట్ల విదేశీపెట్టుబడులుకూడా తీసుకురాలే ని ప్రభుత్వం కూడా ఒకప్రభుత్వమేనా?
విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వంచేసుకున్న ఒప్పందాలన్నీ ఫేక్ ఒప్పందాలే. రూ.1000కోట్ల టర్నోవర్ కూడా లేని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ, రూ.76వేల కోట్ల పెట్టుబడి పెడుతుందా?
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మాటలు వింటేనవ్వొస్తుంది. ఆయనకంటే స్కూల్ విద్యార్థే నయం. ఈ ప్రభుత్వం ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో రూ.8లక్షలకోట్లతో సోలార్ విద్యుత్ ఉత్పత్తితయారీ ఒప్పందాలు చేసుకున్న ట్టుచెబుతోంది. ప్రభుత్వం ఒప్పందాలుచేసుకున్న కంపెనీలన్నీ కడపకు చెందిన వి.. ముఖ్యమంత్రి అనుచరులు, ఆయనబంధువులవే. రూ.1000కోట్ల టర్నోవర్ లేని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.76వేలకోట్లతో రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్ప త్తిచేస్తుందంటే నమ్మాలా?
ప్రభుత్వం చేసుకున్న సోలార్ ఒప్పందాలు చేసు కున్న కంపెనీలన్నీ క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలంటే 5.50లక్షల ఎకరాలభూమి కావాలి. ఏపీలో అంతమిగులుభూమి ఎక్కడాలేదు. ముఖ్యమం త్రి ఆ కంపెనీలకోసం నల్లమలఅటవీభూములు కేటాయిస్తారేమో చూడాలి. ప్రభుత్వంచేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఏవీ అమలయ్యేవికావు. అన్నీ ఫేక్ ఒప్పందాలే. ఫిబ్రవరిలో ఒప్పందాలుజరిగితే ఆకంపెనీలన్నీ ఇప్పటి వరకు ప్రభుత్వంతో ఒక్కసారిమాట్లాడిందిలేదు. దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వ డొల్లతనాన్ని.
4ఏళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు ఏంఊడబెరికారని ట్విట్టర్ లో ఊదరగొట్టుకుంటున్నారు?
2012-13లో ఉమ్మడిఏపీకి రూ.6వేలకోట్ల విదేశీపెట్టుబడులు వస్తే, 2013-14లో రూ..4వేలకోట్లు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2014-15 లో ఏపీకి రూ.8,300కోట్లు, 2015-16లో రూ.10వేలకోట్లు, 2016-17లో దాదా పు రూ.14,767కోట్లు, 2017-18లో రూ.8,100కోట్లు, 2018-19లో రూ.14వేల కోట్ల విదేశీపెట్టుబడులు వచ్చాయి. 5ఏళ్లలో వైసీపీప్రభుత్వం జగన్ రెడ్డి రాష్ట్రానికి తీసుకొచ్చిన విదేశీపెట్టుబడులకంటే టీడీపీప్రభుత్వం ఒకసంవత్సరంలోతీసుకొ చ్చిన పెట్టుబడులే ఎక్కువ. అదీ చంద్రబాబుగారి ఘనత. 4ఏళ్లలో జగన్ రెడ్డి ఏం పీకారు. 4ఏళ్లలో రాష్ట్రాన్ని ఏదోఉద్ధరించినట్టు సిగ్గులేకుండా ట్విట్టర్ లో ఊదరగొ డుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, విదేశీకంపెనీలు తీసుకురాలేని జగన్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అప్పులమీద అప్పులుచేస్తున్నాడు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఎలా అభివృద్ధి అవుతుంది? జగన్ ను ప్రజలు మరలా ఎందుకు నమ్మాలి?
దేశ, విదేశీపెట్టుబడులు, కంపెనీలు రాకుండా రాష్ట్రం ఎలాఅభివృద్ధి చెందుతుంది .. యవతకు ఉపాధి, ఉద్యోగాలు ఎలాలభిస్తాయి? జగన్ రెడ్డిని నమ్మాలంటు స్టిక్కర్లు వేస్తున్నారు. ఏంచేశాడని నమ్మాలి? రాష్ట్రానికి రూ6వేలకోట్లవిదేశీపెట్టు బడులు తీసుకరాలేని తనఅసమర్థతను నమ్మాలా? అప్పులతో నెట్టుకొస్తున్న తన పనితనాన్నినమ్మాలా? ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లతో ప్రజల్ని వంచిస్తున్న తన మోసపుతెలివితేటలకు నమ్మాలా?
జగన్ రెడ్డి రాష్ట్రానికి, ప్రజలకు ఏమీచేయలే డు అని తేలిపోయింది. నెలకు రూ.5, 6వేలకోట్ల అప్పులుచేస్తే తప్ప జగన్ రెడ్డి సామాజికపింఛన్లు కూడా ఇవ్వలేని దుస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నే ప్రజలమైనా, రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు ఎంతత్వరగా ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి, అతనిప్రభుత్వానికి బుద్ధిచెబితే, రాష్ట్రానికి అంత త్వరగా మంచిరోజులువస్తాయి.” అని విజయ కుమార్ చెప్పారు.