Suryaa.co.in

National Telangana

సమతుల్య బడ్జెట్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూ ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించింది. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సబ్ కే సాథ్ సబ్ కా వికాస్ లో భాగంగా.. పేదలను శక్తివంతం చేయడం, అన్నదాత ఉత్పాదక సామర్థ్యాలను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పేదల కోసం:
1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చడానికి ₹ 10 లక్షల కోట్ల పెట్టుబడిని కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించింది.

యువత కోసం:
4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసింది.

అన్నదాతల కోసం
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టాం.

మహిళల కోసం
మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేసింది మోదీ సర్కారు.

పన్ను చెల్లింపుదారుల కోసం
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా.. పన్ను స్లాబ్‌లను మార్చింది. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరగనుంది.

LEAVE A RESPONSE