Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు నమోదు

చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్లో 45 మంది తెదేపా నాయకులపై కేసు నమోదైంది.రామకుప్పం మండలం ఉనిసిగానిపల్లె మాజీ సర్పంచి మహాదేవి, ఆమె భర్త జయశంకర్లను ఎస్సై దూషించి ఎన్ కౌంటర్ చేస్తానని గత వారం కుప్పం కోర్టు వద్ద బెదిరించారు.

ఎస్సై వ్యాఖ్యలను నిరసనగా తెదేపా ఆధ్వర్యంలో బుధవారం పోలీసు స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.విధులకు ఆటంకం కలిగించారంటూ హెడ్ కానిస్టేబుల్ మణి చేసిన ఫిర్యాదు మేరకు తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి (పీఏ) మనోహర్ తోపాటు మరో 44 మందిపై రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A RESPONSE