కేరళ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో పాటు, త్రిస్సూర్ పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేంద్ర సహాయమంత్రి, సురేశ్ గోపీపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ కమ్యూనిస్టు నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, 192 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20న త్రిస్సూర్ పురంలోని స్వరాజ్ మైదానానికి ఆయన అంబులెన్స్ లో వన్ వే రోడ్డులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి వచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులను తరలించే అంబులెన్స్ లో రావడం వివాదాస్పదమైంది. తాను అనారోగ్య కారణాల వల్లే ఇలా అంబులెన్స్ లో రావాల్సి వచ్చిందని సురేశ్ గోపీ అప్పట్లో వివరణ ఇచ్చారు.