Suryaa.co.in

Telangana

వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలస్వామిపై కేసు నమోదు

విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల పై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన రషీద్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, కశ్యప్ పై చర్యలు తీసుకోవాలని…హైదరాబాద్లో అల్లర్లు సృష్టించిన 100 మందిని పోలీసు స్టేషన్ నుంచి విడిపించిన ఒవైసీల పై చర్యలు తీసుకోవాలని ఆగష్టు 28న వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బాలస్వామి తెలంగాణ బంధు పిలుపునిచ్చారు. అలాగే ప్రశాంతంగా ఉన్న భాగ్యనగర్ ను మునావర్ ను పిలిపించిన అశాంతి రేకెత్తించిన కేటీఆర్ ను కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బాలస్వామి వాట్సాప్ ద్వారా పేర్కొన్నారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు బాలస్వామి వ్యాఖ్యల పై సుమోటోగా కేసు నమోదు చేసిన్నట్లు సమాచారం.

LEAVE A RESPONSE