Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు లాంటి ఊసరవెల్లిని దేశంలో ఎక్కడా చూడలేదు

– ఎన్టీఆర్‌ వర్ధంతినీ రాజకీయానికి వాడుకుంటావా చంద్రబాబూ…?
– అతనే చంపేస్తాడు…అతనే దండేసి దండం పెడతాడు
: విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ
– సంక్షేమానికి కొలమానం మహానేత డా. వైఎస్సార్‌
– ఆయన అడుగుజాడల్లో సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శం వైఎస్‌ జగన్‌
– ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్‌ను మరిపించింది మహానేత వైఎస్సార్, జగన్‌లు మాత్రమే
– ఆయ్యన్న పాత్రుడు వాఖ్యలను ఎవరూ హర్షించరు
– ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏమిటనేది మా వద్దకు రాలేదు

చంద్రబాబు లాంటి ఊసరవెల్లిని దేశంలో ఎక్కడా చూడలేదు
ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు.ఎన్టీఆర్‌ని కీర్తిస్తే మంచిదే కానీ…మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం దేనికి..?ఎన్టీఆర్‌ మరణానికి కారణం ఎవరనేది యావత్‌ భారత్‌ దేశానికి తెలుసు.అతనే చంపేస్తాడు…అతనే సమాధి చేస్తాడు…అతనే మళ్లీ దండేసి దండం పెడతాడు..ఇలాంటి ఊసరవెల్లిని దేశంలో ఎక్కడా చూడలేదు. మహానేత రాజశేఖరరెడ్డి మహానుభావుడు…సంక్షేమానికి కొలమానం వైఎస్సార్‌. ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన పథకాలు ఇప్పుడు దేశమంతా ఆమలు చేస్తున్నారు. పేదవాడికి పట్టెడన్నం దొరుకుతుంది.. అంటే కారణం ఈ ప్రభుత్వం విధానాలే. పచ్చ మీడియాలో డప్పు కొట్టించుకోవడం కాదు…గ్రామాల్లోకి వెళితే ఈ ప్రభుత్వ పనితీరు ఏమిటో తెలుస్తుంది.వారి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో వారే చెప్తారు..ఎన్టీఆర్‌ను మరిపించిన వారు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే డా వైఎస్సార్, జగన్‌ మాత్రమే.

నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే చూస్తూ ఊరుకోవాలా..?
జీవో నంబర్‌ 1లో ఎక్కడన్నా నిషేధం విధించామా…? సభలు పబ్లిక్‌ రోడ్లలో పెట్టాల్సి వస్తే అనుమతి తీసుకోండి అని చెప్పాం…అదికూడా తప్పేనా…?జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు డీజీపీని అనుమతి అడిగాం…ప్రతి ఎస్పీ వద్దకు వెళ్లి అనుమతి తీసుకున్నాం.వారు ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే అమలు చేశాం. నేను ప్రతిపక్ష నాయకుడిని…నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే చూస్తూ ఊరుకోవాలా..రోడ్‌ షోలు, ర్యాలీలు చేయవద్దని జీవో లో ఎక్కడైనా ఉందా..?అన్ని పక్షాలు ఇప్పుడు దీనిపై కలిసి వచ్చేది ఏముంది… వాళ్లంతా కలిసే ఉన్నారుగా.చంద్రబాబునాయుడు, సెలబ్రిటీ పార్టీ, రామకృష్ణ…అంతా కలిసే పనిచేస్తున్నారు..ఇక మళ్లీ కలిసేది ఏముంది..?

ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏమిటనేది మా వద్దకు రాలేదు
గవర్నర్‌ గారి వద్ద నుంచి వస్తే పరిశీలిస్తాం…చేయాల్సిది తప్పకుండా చేస్తాం.ఉపాద్యాయ సంఘాల వారితో సమావేశం అయ్యాను…వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడతాం.ఏదైనా చిన్న చిన్న అంశాల్లో విభేదాలున్నా కూర్చుని పరిష్కరించుకుంటాం.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాల్సినవన్నీ చేస్తాం. రాజ్యాంగపరమైన పదవులు చేసిన అయ్యన్నపాత్రుడు లాంటి వారు మాట్లాడే మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి.అలాంటి మాటలు మాట్లాడటం వల్లే రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో చిన్నచూపు వస్తోంది. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ ఆయన చేసిన వాఖ్యలను ఎవరూ హర్షించరు.

LEAVE A RESPONSE