– మంకీమ్న్ బయో అనే కంపెనీ తో జూన్ లో 345 కోట్ల పెట్టుబడుల ఒప్పందం
– గో ది మీడియా ,వాల్ష్ కర్రా లాంటి బోగస్ సంస్థ లతో కూడా రేవంత్ ప్రభుత్వం ఒప్పందం
– బోగస్ పెట్టుబడుల ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ మంత్రివర్గం పై కేసులు ఉండవా ?
– బీ ఆర్ ఎస్ నేత మన్నె క్రిశాంక్
మంకీమ్న్ బయో అనే కంపెనీ తో జూన్ లో 345 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ కంపెనీ ని ఈ నెలలోనే రిజిస్టర్ చేశారు. యతిరాజం మధుశేషు అనే చార్టర్ అకౌంటెంట్ పేరిట ఆ కంపెనీ ని కేవలం లక్ష రూపాయల మూల ధనం తో రిజిస్టర్ చేశారు. లక్ష రూపాయల కంపెనీ తో 345 కోట్ల రూపాయల ఒప్పందమా ? బ్లాక్ మనీ ని వైట్ గా మార్చుకునే కుట్ర దీని వెనక ఉందా ? దర్యాప్తు జరగాలి.
పిలగాడు పుట్టక ముందే పదో తరగతి పాస్ అయినట్టు ఉంది ఈ మొత్తం వ్యవహారం. ఈ కంపెనీ వెనుక ఏ మంత్రి ఉన్నాడో నిగ్గు తేల్చాలి. రాష్ట్రానికి మేలు చేసిన ఫార్ములా ఈ కారు రేసింగ్ పైన కాదు కేసు పెట్టాల్సింది. బోగస్ కంపెనీ ల భాగోతాన్ని నడుపుతున్న వారి పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపాలి. రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీ తో కూడా గతం లో ఇలాంటి బోగస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గో ది మీడియా ,వాల్ష్ కర్రా లాంటి బోగస్ సంస్థ లతో కూడా రేవంత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
కే టీ ఆర్ తెచ్చిన పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా కనిపిస్తాయి. రేవంత్ పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు కనిపించవేం ? పెట్టుబడులు తెచ్చిన కే టీ ఆర్ పై అక్రమ కేసులు పెడతారు .మరి బోగస్ పెట్టుబడుల ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ మంత్రివర్గం పై కేసులు ఉండవా ? ఈడీ ఏసీబీ ఈ బోగస్ కంపెనీ ల పై విచారణ జరపరా ? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ బిజెపి లు ఎట్టకేలకు కే టీ ఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి తెచ్చుకున్నాయి.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో అవినీతి గురించి ప్రస్తావన లేదు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కంటిన్యూ చేస్తే కేసీఆర్ కే టీ ఆర్ లకు కు పేరొస్తుందని రేవంత్ రెడ్డి ఆ ఈవెంట్ ను ఆపారు. ఆ ఈవెంట్ కంపెనీ తనకు లంచం ఆశ చూపిందని రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో చెప్పారు. మరి ఏ దర్యాప్తు సంస్థకు దాని గురించి ఎందుకు రేవంత్ ఫిర్యాదు చేయలేదు ? అభద్రతా భావం తోనే రేవంత్ రెడ్డి కే టీ ఆర్ పై కేసు పెట్టారు. కే టీ ఆర్ అనేక భాషల్లో బాగా మాట్లాడుతారు .
ఇండియా తెలంగాణ ల గురించి అంతర్జాతీయ వేదికల మీద బ్రహ్మాండంగా మాట్లాడతాడు .అందుకే రేవంత్ కే టీ ఆర్ పై కక్ష కట్టారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదు .700 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు తెచ్చింది. ఒక్క ఈవెంట్ కే అన్ని పెట్టుబడులు వస్తే మరిన్ని ఈవెంట్లు జరిగితే ఇంకా ఎన్ని పెట్టుబడులు వచ్చేవో ? ఇవుడు రేవంత్ బోగస్ కంపెనీ లతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఫార్ములా-ఈ వల్ల వచ్చిన ప్రయోజనాలు
– ● బిలిటీ ఎలక్ట్రిక్, అటరో, అమర్ రాజా, అలాక్స్ వంటి కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
● ఈవి పాలసీ, ప్రోగ్రెసివ్ ఇండస్ట్రియల్ విధానం వల్ల పెట్టుబడులు వాస్తవంగా నేలమీద ఫ్యాక్టరీలుగా నిలిచాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బోగస్ పెట్టుబడులు
● గోది ఇండియా, స్వచ్ఛ బయో, వాల్ష్ కర్ర, ఉర్సా క్లస్టర్ – ఇవన్నీ పేపర్ మీదున్న పేర్లు మాత్రమే; నేలమీద ఏమీ లేవు.
● తాజా మనకిన్ బయో ‘340 కోట్లు’ పెట్టుబడి కేసు: ○ జూన్లో పెట్టుబడి ప్రకటన. ○ కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రం 12 నవంబర్ 2025. ○ పుట్టకముందే పెట్టుబడి పెట్టిన అరుదైన ఉదంతం. ○ పేడ్ అప్ క్యాపిటల్ కేవలం 1 లక్ష రూపాయలు. ○ ఏలూరు కు చెందిన డైరెక్టర్లు ఇద్దరు మాత్రమే, యతిరాజం మధుశేష్, యతి రాజం అనసూయ
● 340 కోట్లు ప్రకటించడం బోగస్ పెట్టుబడుల స్పష్టమైన ఉదాహరణ.
● ఇలాంటి షెల్ కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారన్న తీవ్ర అనుమానాలు.