Suryaa.co.in

Andhra Pradesh

గ్యాంగ్ రేప్ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

-బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
-బాధితురాలికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
-మంత్రులు వనిత, సురేషులకు దళిత నేత నీలం డిమాండ్

రేపల్లె రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, బాధితురాలికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దళిత నేత నీలం నాగేంద్రరావు, సోమవారం బాధితురాలిని పరామర్శించేందుకు ఒంగోలు వచ్చిన మంత్రులు తానేటి వనిత ఆదిమూలం సురేషులను డిమాండ్ చేశారు. ఒంగోలు NSP గెస్ట్ హౌస్ వద్ద మంత్రులు తానేటి వనిత ఆదిమూలం సురేష్ ను నాగేంద్ర కలిశారు.

గ్యాంగ్ రేప్ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ వేయలేదని నాగేంద్ర చెప్పడంతో, హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఎస్సీ ఎస్టీ యాక్టు వేయిస్తామని హామీ ఇచ్చారు. 95 GO ప్రకారం FIR స్టేజ్ రిలీఫ్ 4,12,500 రూపాయలు, 28 GO ప్రకారం, FIR స్టేజి రిలీఫ్ 25,000/- రూపాయలు తక్షణమే ఇవ్వాలన్నారు.

రిలీఫ్ వేరు, ఎక్స్గ్రేషియా వేరని…
చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం, FIR స్టేజి రిలీఫ్ కింద 4 లక్షల పాతిక వేల రూపాయలు రిలీఫ్ వస్తుందని, ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం ఎక్స్గ్రేషియా ఇస్తారని, 2019 జూన్లో ఒంగోలు బస్టాండ్లో అత్యాచారానికి గురైన గుంటూరు మైనర్ బాలికకు 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన జగన్, రేపల్లె రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ బాధితురాలికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మాత్రమే ఇచ్చారని నాగేంద్ర మంత్రులు వనిత, సురేషులకు తెలిపారు. దళితుల మేనమామ అని చెప్పుకుంటున్న జగన్ దళిత మహిళ గ్యాంగ్ రేపుకు గురైతే, మొక్కుబడిగా, 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తగదన్నారు. దీంతో మంత్రులు ఎక్స్గ్రేషియా విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

LEAVE A RESPONSE