– 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్
– ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2400 కొత్త బస్సుల కొనుగోలు
– తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఎంజిబీఎస్లో మహా లక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్ : 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండగ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 2023 న ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణికులు 6680 కోట్లు ఆదా చేసుకున్నారు వారికి శుభాకాంక్షలు.
మునిగి పోతున్న పడవ ఎందుకు ఎక్కుతారు అని ఆరోజు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ. 200 కోట్ల మహిళా ప్రయాణికుల చార్జీలను 6680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లించింది
భవిష్యత్తులో కూడా మీ చార్జీలను ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వచ్చిన ఆదాయం ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2400 కొత్త బస్సులు కొనుగోలు చేసింది. ఆర్టీసీ పై రవాణా శాఖ మంత్రి కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఒకప్పుడు ఆర్టీసీ ఆక్యుపెన్సి రేషియో 62 శాతం ఉంటే ఇప్పుడు 97 శాతం కి పెరిగింది.
మహా లక్ష్మి కి ముందు 45 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 65 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలోచన చేసినప్పుడు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చడానికి నగరంలో ఉన్న 2800 బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ కసరత్తు చేస్తుంది.
ఇప్పటికే 3000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే 11 శాతం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. దానిని పెంచుకుంటూ పోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. ఆర్టీసీ లో కేవలం ప్రయాణమే కాదు. ఆర్టీసీ బస్సులకు యాజమానులను చేశాం. వడ్డీలేని రుణాలు ద్వారా బస్సులు కొనుగోలు చేయించారు.
150 మహిళా సంఘాల ఆర్టీసీ బస్సు యజమానులకు కోటి రూపాయల చెక్కులు ఇటీవలే అందించాం. ఇప్పటికే 25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించాం ఈ 5 ఏళ్లలో లక్ష కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కోట్ల రూపాయలతో రోడ్ల మరమత్తులు ,అభివృద్ధి చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నారు. దీని ద్వారా రవాణా మరింత అభివృద్ధి చెందుతుంది.