నర్సరావుపేట: గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు శ్రీ శివ బిల్వార్చన సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక మాస మూడవ ఆదివారం నాడు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం బిల్వార్చన అదేవిధంగా పార్వతి అమ్మవారికి ముత్తయిదువులచే లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో శివ బిల్వార్చన సంఘ అధ్యక్షులు పిల్లుట్ల వెంకటరమణమూర్తి కార్యదర్శి కోట సాంబశివరావు కోశాధికారి మేళ్లచెరువు రాధాకృష్ణ సతీష్ బాబు మరియు సంఘ సభ్యులు విష్ణుభట్ల మధుసూదన శర్మ పోలా నాగేశ్వరరావు కొప్పరపు పురుషోత్తం బొగ్గరం తారక నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు.