(కంకిపాటి మురళీకృష్ణంరాజు)
ఇక్కడ ఉన్న ఫోటోలో ఒక భావోద్వేగ క్షణం దాగి ఉంది.
ఇది కేవలం ఒక ఫ్రేమ్ కాదు –
ఇది తరం నుండి తరానికి బీజేపీ నిబద్ధత, నాయకత్వ గుణాలు, విలువలు ఎలా తరలుతాయో చూపించే సజీవ సాక్ష్యం!
ఇద్దరూ “మాధవ్‌లు”
ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ గర్వకారణాలు.
ఇద్దరి తండ్రులు జనసంఘ్ నుంచి బీజేపీ వరకు ప్రజా సేవలో నిలిచిన ఆదర్శవంతులు.
ఇద్దరూ విద్యార్థిదశ నుంచే సంఘ్ పరివార్ లో చురుకుగా వుంటూ భాగస్వాములుగా మారినవారు.
మంచి విద్య, విలువలపై నమ్మకం, పని పట్ల కమిట్మెంట్ తో ఎదిగిన నాయకులు ఎంతో మంది బీజేపీ కార్యకర్తలకి ప్రేరణ ఇచ్చిన మార్గదర్శకులు.
రామ్ మాధవ్ – జాతీయస్థాయిలో పార్టీకి వ్యూహకర్తగా, ఆలోచనా శక్తిగా, అంతర్జాతీయంగా కూడా భారత రాజకీయ గొంతుగా నిలిచినవారు.
పివిఎన్ మాధవ్ – రాష్ట్ర స్థాయిలో ప్రజల మధ్యకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నిజమైన నాయకుడు.
వారసత్వం అంటే పదవులు పొందడం కాదు…
అది తండ్రుల నుండి వారసులకి మారిన విలువల ప్రస్థానం!
అది సిద్ధాంతాల పట్ల నిబద్ధత, ప్రజల పట్ల నిస్వార్థం, పార్టీ పట్ల అనురక్తి!
ఈ ఇద్దరు నాయకులు ఆ నమ్మకాన్ని తమ రాజకీయ జీవితంతో నిరూపించారు.
ఈరోజు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం…
ఇది ఒక భావోద్వేగ క్షణం కాదు,
ఒక చరిత్రాత్మక క్షణం!
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయక నేతల ఆత్మీయ కౌగిలి!