బిజెపి పార్టీ నాయకుడు , పద్మశాలి ముఖ్య నేత సాంబారి ప్రభాకర్ బీజేపీ పార్టీకి రాజీనామా
తనకు సీటు ఇప్పిస్తానని ,పార్టీ కార్యక్రమాలకు మీటింగ్లో తనను ఖర్చు పెట్టుకోమని చెప్పి ఖర్చు పెట్టించి తనకు టికెట్ కేటాయించకుండా తానే పోటీ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో 70 వేలకు పైగా ఓట్లు కలిగి ఉన్న పద్మశాలీలకు ఎంపీ అరవింద్ టికెట్ కేటాయిస్తానని చెప్పి తాను మోసం చేశాడని ఆయన ప్రశ్నించారు. తనకు తన పద్మశాలి సమాజానికి అన్యాయం చేసిన బిజెపి అభ్యర్థి అరవిందును తమ ఓటు హక్కు ద్వారా తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.