Suryaa.co.in

Andhra Pradesh

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం మల్లన్నకు చోటు

– శ్రీశైలం మల్లన్న ఆలయానికి అరుదైన పురస్కారం
– ఆలయ విస్తీర్ణం, నంది విగ్రహానికి రికార్డ్స్ లో చోటు
– ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు

శ్రీశైలం: జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయ విస్తీర్ణం, అలాగే ఆలయంలోని నంది విగ్రహనికి ఉన్న చరిత్ర, పురాతన పరంగా, ఆధ్యాత్మికంగా, పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉండడంతో ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ ఆలయానికి చోటు లభించింది. ఈ ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీవీకరణ పత్రం అందింది.  ఈ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆలయ ఇవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ అందజేశారు. గతంలోనూ ఈ దేవస్థానం ఏడు విభాగాలకు ఐఎస్ఓ ద్వారా ధ్రువీకరణ పత్రం అందుకుంది.
కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడుతుంటుంది. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తుంటారు.

LEAVE A RESPONSE