*శ్రీ అయ్యప్పస్వామి నగరోత్సవంలో పాల్గొన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా కుటుంబ సభ్యులు
*పెద్ద సంఖ్యలో పాల్గొన్న సర్వ దీక్షా స్వాములు,భక్తులు
*జ్యోతి ప్రదర్శనలో చిన్నారి భక్తులు
*అయ్యప్ప స్వామి శరణు ఘోషతో నగరోత్సవం
బుధవారం ఉదయం శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి విశేష పూజల అత్యంత వైభవంగా నిర్వహించారు.అయ్యప్పస్వామి వారికి మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు,శిద్దా పాండురంగరావు,శిద్దా సుధాకర్ తమ కుటుంబ సభ్యులతో కలసి మహా గణపతి పూజ,గంగ పూజ, మండపారాధన మహన్యాసక పఠనం,ఆదిత్యాధి నవగ్రహ పూజ అనంతరం అయ్యప్పస్వామి వారికి సర్వ దీక్ష స్వాములు గోపాల గురు స్వామి లతో కలసి,పంచామృత,ఫలరసాల,బస్మ,గంధ,పన్నీరు అభిషేకాలు నిర్వహించి స్వామి వారికి విశేష పూజలు,అష్టోత్తరపూజలు,అలంకరణ వైభవంగా నిర్వహించారు.అనంతరం శిద్దా రాఘవరావు దంపతులు కుటుంబ సభ్యులతో శ్రీ అయ్యప్పస్వామి వారిని ,మంగళ వాయిద్యాల వేద మంత్రాలతో స్వామి వారిని అంతరాలయానికి చేర్చి విశేష పూజలు నిర్వహించి మహా హారతులు సమర్పించారు. శ్రీ హరిహర క్షేత్రంలో అభిషేకాలు సందర్భంగా సకల దీక్షా స్వాముల అయ్యప్ప శరణు ఘోషలతో హరిహర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నేలకొంది. వేద పండితులు నేలబోట్ల రామకృష్ణ శాస్త్రిఅల్లూరి మనోజ్న శర్మ బృందం ఆధ్వర్యంలో పూజా క్రతువు నిర్వహించారు.శిద్దా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు,సర్వ దీక్ష స్వాములకు బిక్ష ఏర్పాటు చేసారు.
*అట్టహాసంగా అయ్యప్పస్వామి నగరోత్సవం
###################
మాజీమంత్రి శిద్దా రాఘవరావు దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పస్వామి నగరోత్సవం వీనులవిందుగా,కమనీయంగా సాగింది.ఈ సందర్భంగా శ్రీ అయ్యప్పస్వామి నగరోత్సవం పునస్కరించుకొని ఊరేగింపు రథాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు,విశేష పూలు,విద్యుత్ దీపాలతో స్వామి వారి రధం
సర్వాంగ సుందరంగా అలంకరించారు. శిద్దా రాఘవరావు దంపతులు, శిద్దా సుధీర్ కుమార్ దంపతులు,శిద్దా సుధాకర్, శిద్దా కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి నగరోత్సవం లాంఛనంగా ప్రారంభించారు.చిన్నారులు సాంప్రదాయ దుస్తులతో జ్యోతి ప్రదర్శన నగరోత్సవానికి ప్రత్యేక శోభను తెచ్చింది.సర్వ దీక్షా స్వాములు,గురు స్వాములు నగరోత్సవంలో పాల్గొని శ్రీ అయ్యప్పస్వామి భజనలు,కీర్తనలను భక్తిపారవశ్యం ఆలపించారు.మంగళ వాయిద్యాలు,కీర్తనల తో శ్రీ అయ్యప్పస్వామి నగరోత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగింది.చీమకుర్తి ప్రధాన రహదారి వెంట మహిళలు శ్రీ అయ్యప్పస్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి అయ్యప్పస్వామి హారతులు అందుకొన్నారు.అయ్యప్పస్వామి నగరోత్సవంలో సర్వ దీక్షా స్వాములు, మహిళా భక్తులు,చీమకుర్తి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్పస్వామి నగరోత్సవం మాజీమంత్రి శిద్దా రాఘవరావు నివాసం వరకు సాగింది అనంతరం శిద్దా రాఘవరావు దంపతులు కుటుంబ సభ్యులతో కలసి జ్యోతి ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు,భక్తులకు,స్వాములకు ప్రత్యేక ప్రసాదాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో శిద్దా కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులు, చీమకుర్తి పరిసర ప్రాంతాలను చెందిన సర్వ దీక్షా స్వాములు, వాసవి మహిళలు,చీమకుర్తి కి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ,హరి వెంకట కుమరా చార్యులు,హరికృష్ణ శర్మ,కృష్ణ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు.