ఓ కర్కశ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే వీధి శునకమే తల్లిగా మారింది. తన బిడ్డలతో పాటే రాత్రంతా కాపలా కాసింది. ఎలాంటి హానీ కలగకుండా రక్షణగా నిలిచింది.ఈ సంఘటన ఛత్తీస్గఢ్ ముంగెలీ జిల్లా సారిస్తాల్ గ్రామంలో జరిగింది.
శునకాలతో పాటు శిశువు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు పాపను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెంటనే లోర్మీ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై చింతారామ్ చిన్నారిని ముంగెలీకి తరలించి చికిత్స అందించారు.
పాపకు ‘ఆకాంక్ష’ గా నామకరణం చేశారు అక్కడి చిన్నారుల సంక్షేమ కమిటీ సభ్యులు. పాపను ఎవరికి అప్పగించాలనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. మరోవైపు పాపను వదిలేసిన కుటుంబాన్ని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.